కాంగ్రెస్ కు మరో షాక్.. ఈనెల 31న టీడీపీలో చేరనున్న మాజీ మంత్రి

Submitted by nanireddy on Sun, 08/26/2018 - 16:23
ex minister kondru murali will join in tdp

కాంగ్రెస్ నుంచి మరోసారి వలసలు ఊపందుకున్నాయి. ఇప్పటికే అగ్రశ్రేణి నేతలంతా ఎవరిదారి వారు చూసుకున్నారు. తాజాగా మరో మాజీ మంత్రి టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న కొండ్రు మురళి కాంగ్రెస్ ను వీడనున్నారు. ఈనెల 31 న సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నట్టు అయన తెలిపారు. విభజన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితి బాధ కలిగించిందన్నారు. కష్టకాలంలో తనతో ఉన్న కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే టీడీపీలో ఏ పదవి ఇచ్చినా నిబద్ధతతో పనిచేస్తానని అన్నారు. 
 

English Title
ex minister kondru murali will join in tdp

MORE FROM AUTHOR

RELATED ARTICLES