విజయసాయిరెడ్డికి ఝలక్ ఇచ్చిన మాజీ డీజీపీ నండూరి..

Submitted by nanireddy on Mon, 08/27/2018 - 07:58
ex dgp nandoori sambasivarao gasve jalak on ycp mp vijayasaireddy

ప్రజాసంకల్ప యాత్రలో వైసీపీ అధినేత వైయస్ జగన్ ను మాజీ డీజీపీ నండూరి సాంబశివరావు కలిశారు. దీంతో అయన వైసీపీలో చేరుతున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఒకానొక సమయంలో ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. నండూరి సాంబశివరావు తమ పార్టీలో చేరుతున్నారని, అయన చేరికతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని అన్నారు. అయితే అయన  అలా అని 24 గంటలు గడిచిందో లేదో తాను వైసీపీలో చేరడంలేదని సాంబశివరావు స్పష్టం చేశారు. విజయసాయిరెడ్డి కేవలం సమాచార లోపంతోనే అలా మాట్లాడి ఉంటారని అన్నారు. జగన్ ను ప్రతిపక్ష నాయకుడు అన్న ఉద్దేశ్యంలో కలిశానని.. గతంలో కూడా విశాఖ జిల్లాలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో పాదయాత్ర చేసిన చంద్రబాబును కూడా కలిశానని గుర్తుచేశారు. తాను ఏ పార్టీలో చేరానని, రాజకీయాలంటే ఇష్టం లేదని తెలిపారు. దీంతో ఎంపీ విజయసాయిరెడ్డి అనవసరంగా నోరుజారారా అన్న చర్చ మొదలైంది.   

English Title
ex dgp nandoori sambasivarao gasve jalak on ycp mp vijayasaireddy

MORE FROM AUTHOR

RELATED ARTICLES