విశాఖలో వైయస్ జగన్ ను కలిసిన మాజీ సీఎస్

Submitted by nanireddy on Mon, 09/10/2018 - 17:32
ex cs iyr krishnarao meets ys jagan in vizag

ప్రస్తుతం  వైసీపీ అధినేత వైయస్ జగన్ పాదయాత్త్ర విశాఖ జిల్లాలో జోరుగా సాగుతోంది. ఇవాళ జగన్ తన యాత్రలో భాగంగా బ్రాహ్మణ సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పలువురు బ్రాహ్మణులు హాజరయ్యారు. ఈ సదస్సుకు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు సైతం హాజరయ్యారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ..  అర్చకులు పడుతున్న ఇబ్బందులు, పేద బ్రాహ్మణులు కోసం ప్రత్యేకంగా నిధి ఏర్పాటు, అలాగే చట్టసభల్లో బ్రాహ్మణులకు ప్రాధాన్యం కల్పించాలని జగన్ ను కోరారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. టీడీపీ తొలి నుంచి బ్రహ్మణులను ఇబ్బంది పెడుతోందని విమర్శించారు. అర్చకులకు రిటైర్మెంట్‌ లేకున్నా.. రమణ దీక్షితులను తొలగించారని మండిపడ్డారు. ఇక చివరిగా మాట్లాడిన వైయస్ జగన్తాము అధికారంలోకి వస్తే కచ్చితంగా బ్రాహ్మణులకు న్యాయం చేస్తామని అన్నారు . సాధ్య సాధ్యాలను పరిశీలించి బ్రాహ్మణ కార్పొరేషన్  కు వీలైనన్ని ఎక్కువ నిధులు కేటాయించడానికి  కృషిచేస్తానన్నారు. 

English Title
ex cs iyr krishnarao meets ys jagan in vizag

MORE FROM AUTHOR

RELATED ARTICLES