శభాష్ కలెక్టరమ్మ .. సొంత కూతురిని సర్కార్ బడికి పంపుతుంది ..

శభాష్ కలెక్టరమ్మ .. సొంత కూతురిని సర్కార్ బడికి పంపుతుంది ..
x
Highlights

ప్రస్తుతం ఉన్న విద్యావ్యవస్థలో ప్రజలకు ప్రభుత్వ బడులపైన నమ్మకం పోయింది . ఓ రూపాయి కూడబెట్టి అయిన ప్రైవేటు స్కూల్స్ కే మొగ్గు చూపుతున్నారు...

ప్రస్తుతం ఉన్న విద్యావ్యవస్థలో ప్రజలకు ప్రభుత్వ బడులపైన నమ్మకం పోయింది . ఓ రూపాయి కూడబెట్టి అయిన ప్రైవేటు స్కూల్స్ కే మొగ్గు చూపుతున్నారు తల్లితండ్రులు .. గవర్నమెంట్ స్కూల్స్ లో చదువు చెప్పే టీచర్ల పిల్లలను కూడా ప్రైవేటు స్కూల్స్ లోనే చదివిపిస్తున్నారు . ఇక కలెక్టర్ వాళ్ళ పిల్లల గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ సర్కారు బడుల మీద ఉన్న నమ్మకంతో ఓ కలెక్టరమ్మ మాత్రం తన కుమార్తెను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి అందర్నీ ఆశ్చర్యపరిచారు.

తెలంగాణలోని వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ మస్రత్‌ ఖానం అయేషా తన కుమార్తెను ప్రభుత్వ మైనార్టీ గురుకుల పాఠశాలలో చేర్పించారు. అయేషా తన కుమార్తె సబీష్ రాణియాను ఐదో తరగతిలో చేర్పించారు. గతంలో సబీష్ రాణియా ఖమ్మం జిల్లాలోని ఓ ప్రయివేట్ స్కూళ్లో నాలుగో తరగతి వరకు చదువుకున్నారు. ప్రయివేట్ పాఠశాలలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందని భావించిన కలెక్టరమ్మ తన కూతుర్ని గురుకుల పాఠశాలలో డేస్కాలర్‌గా చేర్పించారు. మస్రత్‌ ఖానం అయేషా మార్చి 1న వికారాబాద్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories