లావ‌ణ్య‌కి ఈ సారైనా..

లావ‌ణ్య‌కి ఈ సారైనా..
x
Highlights

లావ‌ణ్య త్రిపాఠికి ఈ ఏడాది ప్ర‌థ‌మార్థం అంత‌గా క‌లిసి రాలేదు. ఈ సంవ‌త్స‌రం ఆరంభంలో ఈ ముద్దుగుమ్మ న‌టించిన 'మిస్ట‌ర్‌', 'రాధ' చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద...

లావ‌ణ్య త్రిపాఠికి ఈ ఏడాది ప్ర‌థ‌మార్థం అంత‌గా క‌లిసి రాలేదు. ఈ సంవ‌త్స‌రం ఆరంభంలో ఈ ముద్దుగుమ్మ న‌టించిన 'మిస్ట‌ర్‌', 'రాధ' చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ్డాయి. ఈ రెండు చిత్రాల్లోనూ మ‌రో హీరోయిన్‌తో షేర్ స్క్రీన్ చేసుకున్న లావ‌ణ్య‌.. వారం గ్యాప్‌లో రానున్న రెండు కొత్త చిత్రాల్లో మాత్రం సోలో హీరోయిన్‌గా సంద‌డి చేయ‌నుంది. ఈ నెల 8న నాగ‌చైత‌న్య‌తో లావ‌ణ్య జోడీక‌ట్టిన 'యుద్ధం శ‌ర‌ణం' విడుద‌ల కానుండ‌గా.. 15న సందీప్ కిష‌న్‌కి జంట‌గా న‌టించిన 'ప్రాజెక్ట్ z' రిలీజ్ కానుంది. ఇద్ద‌రు హీరోయిన్స్‌లో ఒక‌రిగా న‌టించిన సంద‌ర్భంలో లావ‌ణ్య‌కి ద‌క్క‌ని విజ‌యం.. సోలో హీరోయిన్‌గానైనా ద‌క్కుతుందా? వేచిచూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories