కర్ణాటక: ఎన్నికల షెడ్యూల్‌ ట్వీట్‌పై దుమారం

Submitted by arun on Tue, 03/27/2018 - 14:17
Amit Malviya

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల తేదీల లీక్‌పై ఈసీ ఆఫీసులో దుమారం చెలరేగింది. ఎన్నికల సంఘం కర్నాటక అసెంబ్లీ ఎన్నికల తేదీలను వెల్లడించక ముందే ఆ తేదీలు ఎలా బయటకు వచ్చాయని సీఈసీ ఓపీ రావత్‌ను ఇవాళ మీడియా ప్రశ్నించింది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు మే 12న నిర్వహించనున్నట్లు బీజేపీ ఐటీ సెల్ విభాగం నేత అమిత్ మాల్వియా తన ట్విట్టర్ అకౌంట్‌లో ముందే పోస్ట్ చేశారు. దీనిపై సీఈసీని ఇవాళ మీడియా ప్రశ్నించింది. అయితే ఈ విషయాన్ని విచారిస్తామని సీఈసీ ఓం ప్రకాశ్ రావత్ తెలిపారు. ఎన్నికల తేదీల లీకేజీపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల సంఘం నుంచి కొన్ని అంశాలు లీకైనట్లు ఆయన అంగీకరించారు. తేదీల లీకేజీ వ్యవహారంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. సోషల్ మీడియా వల్ల ఎన్నికల నిర్వహణపై ఎటువంటి ప్రభావం పడకుండా ఉండేందుకు అనేక జాగ్రత్తలు తీసుకున్నట్లు సీఈసీ ఓపీ రావత్ స్పష్టం చేశారు.

English Title
Even Before Karnataka Poll Announcement, BJP's Amit Malviya Tweeted Date

MORE FROM AUTHOR

RELATED ARTICLES