నిరుద్యోగులకు అండగా ముఖ్యమంత్రి యువనేస్తం

నిరుద్యోగులకు అండగా ముఖ్యమంత్రి యువనేస్తం
x
Highlights

నిరుద్యోగం యువతను వేధించే సమస్య. డిగ్రీలు, పీజీలు పూర్తి చేసినా సరైన ఉద్యోగం రాక నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతుంటారు. తల్లిదండ్రుల మీద ఆధార పడలేక...

నిరుద్యోగం యువతను వేధించే సమస్య. డిగ్రీలు, పీజీలు పూర్తి చేసినా సరైన ఉద్యోగం రాక నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతుంటారు. తల్లిదండ్రుల మీద ఆధార పడలేక అవస్థలు పడుతుంటారు. ఇలాంటి వారి కోసమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశ పెట్టింది ముఖ్యమంత్రి యువనేస్తం పథకం. యువతకు 2వేల నిరుద్యోగ భృతితో పాటు ఉపాధి రంగంలో శిక్షణ అందిస్తూ అండగా నిలుస్తోంది రాష‌్ట్ర ప్రభుత్వం.

నిరుద్యోగులకు అండగా నిలుస్తోంది ఏపీ ప్రభుత్వం. నిరుద్యోగ యువతకు బంగారు భవిష్యత్ అందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన నిరుద్యోగ భృతి పథకం విజయవంతంగా అమలవుతోంది. 2018 సెప్టెంబర్ 14న పథకం పోర్టల్‌ను సీఎం ఆవిష్కరించారు. గత ఏడాది అక్టోబర్ 2 నుంచి ముఖ్యమంత్రి యువనేస్తం అందుబాటులోకి వచ్చింది. ఈ పథకం ద్వారా మార్చి నెల నుంచి 4లక్షల 62వేల, 814 మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి సుమారు 92కోట్ల 56లక్షల 28వేల రూపాయలను నిరుద్యోగ భృతి కింద అందజేయనున్నారు.

యువనేస్తం పథకం ద్వారా రాష్ట్రంలోని యువతకు కొత్త దిశా నిర్దేశం జరుగుతోంది. 2వేల నిరుద్యోగ భృతితో పాటు యువత భవిష్యత్ ఉజ్వలంగా ఉండటానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. యువనేస్తం ద్వారా నిరుద్యోగులకు శిక్షణతో పాటు ఆసక్తికగల వారికి వృత్తి, నైపుణ్య శిక్షణ ఇచ్చి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను , వ్యాపారులను తయారు చేసే దిశగా ముఖ్యమంత్రి ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నారు.

నిరుద్యోగ భృతితో పాటు ఇష్టమైన రంగాల్లో శిక్షణ ఇస్తుండటంతో నిరుద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా మారింది. ఇప్పటి వరకు వివిధ రంగాల్లో యువనేస్తం శిక్షణతో సుమారు 2లక్షల మంది యువత ఉద్యోగాలు పొందారు. అదేవిధంగా సుమారు 7లక్షల మందికి స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ల ద్వారా శిక్షణ ఇస్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న పర్యాటక రంగానికి సంబంధించి సుమారు 50వేల మంది యువత ఈ పథకం ద్వారా శిక్షణ పూర్తి చేసుకున్నారు. వీరిలో కొందరు విదేశాలకు వెళ్లి పర్యాటక ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు భృతి అందుకుంటూ బంగారు భవిష్యత్‌కు అడుగులు వేసుకుంటున్నారు.

యువతకు శిక్షణ, ఉద్యోగ నియామకాల కోసం కొన్ని ప్రముఖ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఉద్యోగ, వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో యువత రాణించడానికి మరిన్ని మెరుగైన అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు నిరుద్యోగ భృతి ఆసరాగా ఉంటుందని యువతీ యువకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories