విద్యుదాఘాతానికి రైతు మృతి

Submitted by nanireddy on Thu, 07/26/2018 - 10:13
electric-shock-farmer-died-nellore

విద్యుదాఘాతానికి గురై రైతు మృతిచెందాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా బలికొడవలూరు మండలం మజరారెడ్డిపాళెంలో చోటుచేసుకొంది. గ్రామానికి చెందిన కొల్లు గోపాల్‌ (58) అయన బుధవారం ఉదయం తన సొంత పొలంలో గడ్డి కోసేందుకు వెళ్లాడు. గడ్డి కోస్తుండగా పొలంలోని విద్యుత్‌ మోటార్‌కు నేలపై నుంచి వెళ్లిన విద్యుత్‌ తీగ పచ్చికలో కనిపించలేదు. ఈ క్రమంలో గడ్డి కోస్తున్న గోపాల్ ప్రమాదవశాత్తు తీగను పట్టుకోవడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. ఆయనతోపాటే గడ్డికోయడం కోసం మరో వ్యక్తి గోపాల్‌ విగతజీవిగా పడి ఉండటాన్ని కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న కుటుంబసభ్యులు భోరున విలపించారు. మృతుడి కుమారుడు వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

English Title
electric-shock-farmer-died-nellore

MORE FROM AUTHOR

RELATED ARTICLES