అమావాస్య రోజు పోలింగ్...కేసీఆర్‌కు కలిసొచ్చేనా..?

అమావాస్య రోజు పోలింగ్...కేసీఆర్‌కు కలిసొచ్చేనా..?
x
Highlights

కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూలు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కలిసొస్తుందా? జ్యోతిష్య శాస్త్రాన్ని ప్రగాఢంగా విశ్వసించే కేసీఆర్‌కు కమిషన్...

కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూలు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కలిసొస్తుందా? జ్యోతిష్య శాస్త్రాన్ని ప్రగాఢంగా విశ్వసించే కేసీఆర్‌కు కమిషన్ ప్రకటించిన పోలింగ్‌ తేదీ ఆయనకు అనుకూలమా? ప్రతికూలమా? ఈ ఎన్నికల్లో అమావాస్య చంద్రుడిలా వెలుగుతాడా..?

టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సాంప్రదాయాలు, సెంటిమెంట్లను ఎక్కువ విశ్వసిస్తారు. వేసుకునే డ్రెస్‌ నుంచి కూర్చొనే కుర్చీ వరకు ప్రతి విషయంలో జాతకాలు, వాస్తును, న్యూమరాలజీని బలంగా నమ్ముతారు. తిధులు, వార , నక్షత్ర బలాన్ని చూసి మరీ ఏ పనైనా మొదలు పెడుతున్నారు. అంతేకాక ప్రతి విషయాన్నీ పండితులతో చర్చించి తన పనులు మంచి ముహూర్తాలు నిర్ణయించి స్టార్ట్ చేస్తారు. అలాంటి కేసీఆర్‌కు ఈసీ ప్రకటించిన ఎన్నికల తేదీ కష్టాన్ని తెచ్చిపెట్టింది.

ముందస్తు ఎన్నికలకు రెడీ అయినా కేసీఆర్‌కు ఎన్నికల తేదీలు అమావాస్య తలనొప్పిగా మారింది. డిసెంబర్‌ 7న ఎన్నికలు 11న కౌంటింగ్‌ తేదీలు కేసీఆర్‌కు అస్సలు కలిసొచ్చే అంకెలు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. డిసెంబర్‌ 6 బ్లాక్ డే కావడంతో ఈసీ 7న ప్రకటించగా 11న ఫలితాలను ప్రకటించింది. ఫలితాలు 11న మంగళవారం వారంతో ఇక్కడ మంగళవారాన్ని శుభసూచకం కాదని భావిస్తారు.

డిసెంబరు 6వ తేదీన మధ్యాహ్నం 11గంటల 59 నిమిషాలకు అమావాస్య గడియలు వచ్చి డిసెంబరు 7వ తేదీన మధ్యాహ్నం 12.16 గంటలకు వెళ్లిపోతుంది. అంటే సరిగ్గా డిసెంబరు 7వ తేదీన ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలవుతుందంటే అమావాస్య వేళ ప్రారంభమవుతున్నట్లు లెక్క. దీంతో అమావాస్య ప్రభావాన్ని తప్పించడాని కేసీఆర్ గ్రహశాంతులు, ఇతర పూజాది కార్యక్రమాలు చేస్తున్నట్టు వార్తలు ఊపందుకున్నాయి.

మరోవైపు ఎన్నికల షెడ్యూల్ లో కేసీఆర్ కు అనుకూలించే మరో అంశం ప్రభుత్వ ఏర్పాటు తేది. డిసెంబర్ 11 నాటికి ఫలితాలు వెలువడుతాయి. ఆ తర్వాత 15 తేదిన ప్రభుత్వం ఏర్పాటు కానుంది. దీంతో ఒకటి ప్లస్ ఐదు ఆరు అవుతుంది. ఆరు కేసీఆర్ లక్కీ నెంబర్ కావటంతో అమావాస్య ఎఫెక్ట్ నుంచి కేసీఆర్ గట్టెక్కుతారని గులాబీ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories