రైల్వే కేసుల ఉపసంహరణపై ఈసీఐ సీరియస్

రైల్వే కేసుల ఉపసంహరణపై ఈసీఐ సీరియస్
x
Highlights

ఎన్నికల కోడ్ సమయంలో రైల్వే కేసుల ఉపసంహరణపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. కేసుల ఉపసంహరణపై న్యాయశాఖ కార్యదర్శికి అనుమతి ఉందా అని ఈసీ...

ఎన్నికల కోడ్ సమయంలో రైల్వే కేసుల ఉపసంహరణపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. కేసుల ఉపసంహరణపై న్యాయశాఖ కార్యదర్శికి అనుమతి ఉందా అని ఈసీ ప్రశ్నించింది. దీనిపై సీఎస్ ఎస్.కె.జోషికి నోటీసులు జారీ చేసింది ఈసీ.

తెలంగాణ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి ఫోకస్ పెట్టింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక నియమ నిబంధనాలు కచ్చితంగా పాటించేలా ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి తనపై ఉన్న నేరచరిత్రను నామినేషన్ లో పేర్కొనాలని, దీనిపై ప్రతికలు, టీవీల్లో ప్రకటన చేయాలని ఈసీ నిబంధన విధించింది. చాలామంది నేతలపై రైల్వే కేసులు, ఇతర కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ నిబంధన నేతలకు ఇబ్బందిగా మారడంతో ఆ కేసులను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల కోడ్ అమ్లల్లోకి వచ్చాక నవంబర్ 13న తెలంగాణ ఉద్యమం సమయంలో నమోదైన కేసులను ఉపసంహరించుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. న్యాయ శాఖ నుండి ఉత్తర్వు విడుదలైంది.

లా సెక్రటరీ నిరంజన్ రావు ఉద్యమకారులపై రైల్వే కేసులు ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీపై ఈసీ అనుమతి తీసుకోకపోవడం, సీఎస్ కు, స్క్రీనింగ్ కమిటీకి తెలియకుండా జీవో జారీ చేసినట్లు గుర్తించారు. ప్రభుత్వం వెంటనే మరుసటిరోజు ఆ జీవోను రద్దు చేసింది. కేసులు ఎత్తవేత జీవో పై ప్రభుత్వప్రధాన కార్యదర్శి వివరణ ఇవ్వాల్సిందిగా ఈసీఐ కోరింది. హోంశాఖ జారీకి న్యాయశాఖ కార్యదర్శ వద్ద పెండింగ్‌లో ఉన్న కేసులో విషయంలో ఉత్తర్వుల జారీకి న్యాయశాఖ కార్యదర్శికి అనుమతి ఉందా అని ఈసీ ప్రశ్నించింది..? కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో సీఎస్‌ సమక్షంలో స్క్రీనింగ్‌ కమిటీకి ఎందుకు పంపలేదని ప్రశ్నిస్తూ ఈ అంశాలపై తక్షణమే సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషి కి నోటీస్ లు జారీ చేసింది

కోడ్ అమల్లో ఉండగా ఇలాంటి జీవోలు జారీ చేయడంపై ఈసీఐ సీరియస్ అయింది. లా సెక్రటరీ వ్యవహారంపై సీఎస్ ను క్లారిఫికేషన్ అడుగుతూ కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. దీనిపై సీఎస్ ఎస్.కె.జోషి వివరణ ఇచ్చారు. ఈసీఐ నోటీసుసులు అందాయని ఇది పెద్ద సమస్య కాదన్నారు సీఎస్. పూర్తి వివరాలు ఈసీఐకి అందిస్తామన్నారు. రైల్వే కేసుల ఎత్తివేత జీవో జారీ, సీఈసీ సీరియస్ కావడంతో కేసుల్లో ఉన్న నేతల పరిస్థితి అయోమయంలో పడింది.


Show Full Article
Print Article
Next Story
More Stories