ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు...ఈసీ తీపి కబురు

ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు...ఈసీ తీపి కబురు
x
Highlights

ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు.. ఈసీ తీపి కబురు అందించింది. రోజూవారీ ఖర్చులకు సంబంధించిన ధరలను భారీగా తగ్గించింది. ఉదయం తీసుకునే టీ నుంచి...

ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు.. ఈసీ తీపి కబురు అందించింది. రోజూవారీ ఖర్చులకు సంబంధించిన ధరలను భారీగా తగ్గించింది. ఉదయం తీసుకునే టీ నుంచి రాత్రి బిర్యాని వరకు అన్నింటి రేట్లను మార్కెట్‌ ధరల కంటే చాలా తక్కువకే నిర్ధారించారు. దీంతో ఈసీ ధరలు అన్ని పార్టీల అభ్యర్థులకు కలిసివచ్చే అంశంగా చెబుతున్నారు.

ఎన్నికల ఖర్చు విషయంలో ఈసీ తీసుకున్న నిర్ణయం అభ్యర్థులకు భారీ ఉపశమనం లభించినట్లైంది. అభ్యర్థుల రోజువారీ ఖర్చుల విషయంలో ఈసీ కాస్త కరుణించింది. ముఖ్యంగా బరిలో నిల్చే అభ్యర్థి ప్రచారం, తదితర విషయాలపై మొత్తం 28 లక్షల వరకు ఖర్చు చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రతీ పైసా లెక్కను ఏ రోజుకారోజు ఈసీకి సమర్పించాల్సి ఉంటుంది. ఉదయాన్నే తీసుకునే టీ నుంచి రాత్రి బిర్యాని వరకు అన్నింటి వివరాలను పొందుపర్చాల్సి ఉంటుంది.

అనుచరులతో ప్రచారం, బహిరంగ సభలు, వారికి కావాల్సిన ఇతర అంశాలపై చేసే ఖర్చు లెక్కలను అభ్యర్థులు తక్కువ చేసి చూపించే అవకాశం ఉండటంతో ఆయా ధరలను ఎన్నికల కమిషన్ ఎప్పటికప్పుడు నిర్ణయిస్తూ ఉంటుంది. దీంతో ఈ సారి అసెంబ్లీ ఎన్నికలకు కొత్త ధరలను ప్రతిపాదిస్తూ రాజకీయ పార్టీలతో ఈసీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. అలాగే ప్రతిపాదిత ధరలపై అభిప్రాయాలను చెప్పాలని కోరింది. ఈ సారి ప్రతిపాదనల్లో తిను బండారాల ధరలను భారీగా తగ్గించింది.

2014 సాధారణ ఎన్నికల్లో టీ ధర 10 రూపాయలుంటే ఇప్పుడది 6 రూపాయలకు తగ్గించింది. చికెన్‌ బిర్యానీ గతంలో 140 ఉండగా ఇప్పుడు 120 రూపాయలకు పరిమితం చేసింది. అంతేకాకుండా ఇడ్లీ 10 రూపాయలు, వడ 15, వాటర్‌ బాటిల్‌ 10, వెజ్‌ బిర్యానీ 80 రూపాయలుగా నిర్ణయించింది. అయితే అద్దే వాహనాల ధరలను స్వల్పంగా పెంచింది. టాటా ఇండికా అద్దె రోజుకు వెయ్యీ 440 కాగా, క్వాలిస్‌ 2 వేల 160, ఇన్నోవా 2 వేల 640, బస్సు 3 వేల 600, సుమో వెయ్యీ 440 గా నిర్ణయించింది.

ప్రచారంలో ఉపయోగించే ఇతర వస్తువులు, సౌకర్యాల ధరలను మాత్రం కొంత పెంచింది. లౌడ్‌ స్పీకర్లు, వేదిక ఏర్పాటు, కటౌట్లు, బ్యానర్లు, పోస్టర్లు, జెండాలు తదితరాలు ధరలు పెంచిన జాబితాలో ఉన్నాయి. ఇంకా ఎన్నికల ఖర్చులకు సంబంధించి ఈసీ కొన్ని ధరలను ప్రతిపాదించగా వాటిని కూడా తగ్గించాలంటూ, రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేశాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories