భారీగానే కొట్టారు!

భారీగానే కొట్టారు!
x
Highlights

టీమిండియా, పాకిస్థాన్ జట్ల మధ్య వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఈరోజు జరుగుతున్నా మ్యాచ్ లో భారత బ్యాట్స్ మెన్ విజృంభించారు. టాస్ గెలిచి భారత్ కు బ్యాటింగ్...

టీమిండియా, పాకిస్థాన్ జట్ల మధ్య వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఈరోజు జరుగుతున్నా మ్యాచ్ లో భారత బ్యాట్స్ మెన్ విజృంభించారు. టాస్ గెలిచి భారత్ కు బ్యాటింగ్ అప్పచెప్పిన పాకిస్థాన్ కు చుక్కలు చూపించారు. ఓపెనింగ్ జోడీ కె ఎల్ రాహుల్, రోహిత్ శర్మ.. తోలి వికెట్ కు 136 పరుగుల భారీ స్కోరుతో పునాది వేశారు. తరువాత వచ్చిన కోహ్లీ.. రోహిత్ కలిసి రెండో వికెట్ కు 98 పరుగులు జోడించారు. దీంతో భారత్ 380 పరుగుల వరకూ చేయొచ్చనిపించింది. రోహిత్ 140 పరుగులు చేసి అవుటయ్యాకా.. క్రీజులోకి వచ్చిన పాండ్య తో కలసి కోహ్లీ స్కోరు బోర్డును పరిగెత్తించాడు. 51 పరుగులతో భారీ భాగస్వామ్యం దిశగా పరిగెడుతున్న ఈ జోడీని అమీర్ విడదీశాడు. పంద్యాను అవుట్ చేసిన అమీర్ వెంటనే ధోనీ నీ దొరకపుచ్చుకున్నాడు. దీంతో టీమిండియా స్కోరు మందగించింది. ఈ లోపు వరుణుడు నేనున్నానంటూ రావడంతో 50 నిమిషాల పాటు ఆట నిలిచిపోయింది. తరువాత ఆట తిరిగి ప్రారంభమైన వెంఠనే కోహ్లీ (77 ) పరుగుల వద్ద అమీర్ బౌలింగ్ లోనే అవుటయ్యాడు. దాంతో స్కోరు ఐదు వికెట్లను 336 పరుగులకు పరిమితమైపోయింది.

పాకిస్థాన్ విజయలక్ష్యం 337 పరుగులు. ఇక ఈ మైదానంలో ఇప్పటివరకూ అత్యధిక స్కోరు గతంలో ఇంగ్లాండ్‌ మరియు శ్రీలంక మధ్య 318/7గా నమోదవగా.. ఇంగ్లాండ్‌, కెనడా మధ్య అత్యల్ప స్కోర్‌ 45/10 రికార్డు ఉంది. అయితే ఇదే ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు, న్యూజిలాండ్‌ మధ్య జరిగిన పోరులో 286/4 అత్యధిక ఛేదనగా నిలిచింది. ఇపుడు టీమిండియా ఈ మైదానంలో అత్యధిక స్కోరు నమోదు చేసి రికార్డు సృష్టించింది. అదేవిధంగా కోహ్లీ తన 11000 పరుగులను పూర్తి చేసుకున్నాడు.

భారత్ బ్యాటింగ్..
















పాకిస్థాన్ బౌలింగ్..





Show Full Article
Print Article
More On
Next Story
More Stories