అందమైన అమ్మాయి యువకులను కౌగిలించుకున్నవేళ...

Submitted by arun on Wed, 06/20/2018 - 10:19

రంజాన్ పర్వదినంను ముస్లిం సోదరులు యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ పండుగ రోజున ముస్లింలంతా ఒకొరినొకరు ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఈ రంజాన్ పండుగ ఒక్కటే కాదు చాలా వరకు పండుగలన్నింటికీ ముస్లింలు విషెస్ చెబుతూ ఆలింగనం చేసుకుంటారు. ఇదంతా ఎక్కువగా మసీదులు, నమాజ్ చేసే స్థలాల్లో ఇలా చేస్తుంటారు. అయితే చాలా వరకు ఈ ఆలింగనం అనేది మగవాళ్లు చేస్తుంటారనే విషయం అందరికీ తెలిసిందే. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్ నగరంలోని ఓ షాపింగ్ మాల్ ముందు ఓ అందమైన ముస్లిమ్ అమ్మాయి చిరునవ్వులు చిందిస్తూ స్థానిక ముస్లిమ్ యువకులకు ‘ఈద్ ముబారక్’ చెబుతూ కరచాలనం చేసిన ఘటన సంచలనం రేపింది. అందమైన అమ్మాయిని కౌగిలించుకునేందుకు యువకులు బారులు తీరారు. ఓ ముస్లిమ్ అమ్మాయి ఎలాంటి భయం లేకుండా షాపింగ్ మాల్ ముందు రోడ్డుపై నిలబడి నవ్వుతూ అపరిచిత యువకులను కౌగిలించుకొని ఈద్ ముబారక్ చెప్పడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని ఆసిఫ్ అనే యువకుడు వ్యాఖ్యానించారు.

‘‘నా జీవితంలో ఇంతమంది యువకులను కలిసి ఈద్ ముబారక్ చెప్పడం నాకెంతో సంతోషాన్నిచ్చింది’’ అని అపరిచిత అమ్మాయి ఆనందంగా చెప్పింది. గంటపాటు సాగిన కౌగిలింతల పర్వంలో వందలాది మంది యువకులు యువతిని కౌగిలించుకున్నారు. యువతి కౌగిలింతలపై ‘నిజమైన ఈద్’ అని యువకులు సంతోషం వ్యక్తం చేస్తుంటే...ఇలా యువతి యువకులను హగ్ చేసుకోవడం ఇస్లాం సంప్రదాయాలకు విరుద్ధమని ముస్లిమ్ పండితులు అంటున్నారు. ఏదిఏమైనా అమ్మాయి కౌగిలింతల పర్వం వీడియో కాస్తా ఇంటర్ నెట్ లో హల్ చల్ చేస్తోంది.

English Title
Eid Mubarak girl hugging boys

MORE FROM AUTHOR

RELATED ARTICLES