ఆర్థిక సర్వే..వృద్ధిరేటు పరుగు

ఆర్థిక సర్వే..వృద్ధిరేటు పరుగు
x
Highlights

దేశ ఆర్థిక పురోగతి రేటు మెరుగ్గా ఉందని ఆర్థిక సర్వే తెలిపింది. 2018-19 మధ్య కాలానికి ఏడునుంచి 7.5 శాతం వృద్ధి రేటు సాధించే అవకాశాలు పుష్కలంగా ...

దేశ ఆర్థిక పురోగతి రేటు మెరుగ్గా ఉందని ఆర్థిక సర్వే తెలిపింది. 2018-19 మధ్య కాలానికి ఏడునుంచి 7.5 శాతం వృద్ధి రేటు సాధించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో తెలిపారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా పెరగనున్న ముడి చమురు ధరలు మనదేశ ఆర్థిక స్థితిపై కలిగించే ప్రభావంపై ఎకనామిక్ సర్వే ఆందోళన వ్యక్తం చేసింది.

భారత ఆర్థిక స్థితి వేగంగా పుంజుకుంటోందని ఆర్థిక శాఖ తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 7 నుంచి 7.5గా నమోదు కావచ్చని ఆర్థిక శాఖ లెక్కలు గట్టింది. 2018-2019 సంవత్సరానికి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశ పెట్టిన అంచనా నివేదికలో ఈ వివరాలు తెలిపారు.. ఆర్థిక శాఖ సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యన్ ఆధ్వర్యంలో రూపొందిన ఈనివేదికలో 2017-2018 మధ్య కాలంలో ఆర్థిక పురోగతి రేటు 6.5 నుంచి 6.75కు పెరగొచ్చని లెక్క గట్టారు.

జీఎస్టీ అమలువల్ల ఆర్థిక స్థితి గణనీయంగా మెరుగుపడిందని అలాగే బ్యాంకుల రికాపిటలైజేషన్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను నేరుగా ఆహ్వానించడం, ఎగుమతులను గణనీయంగా పెంచడం వల్ల ఆర్థిక సంవత్సరం సగ భాగం నుంచి పురోగతి దూసుకుపోతోందని ఆర్థిక సర్వే నివేదికలో ప్రస్తావించారు..అంతర్జాతీయ మార్కెట్ లో ముడిచమురు ధరలు పెరగడం భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద శాపంగా మారుతోందని..2018 నుంచి ఈ ప్రభావం కాస్త తగ్గి అభివృద్ధి పథంలో కి అడుగులేసే అవకాశం ఉంటుందని ఆర్థిక శాఖ వివరించింది. జిఎస్టీని స్థిరీకరిస్తే.. పెట్టుబడులను వెనక్కి తేగలిగితే.. అభివృద్ధి సాధ్యపడుతుందని సర్వే తెలిపింది. స్టాక్ ధరల్లో వేగమైన కరెక్షన్ కు అవకాశముందని.. తద్వారా పెట్టుబడుల రాకలో కొంత స్తబ్దత ఉండొచ్చని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంస్కరణలను సిద్ధం చేస్తున్న ఆర్థిక సర్వే.. జిఎస్టీని ప్రభుత్వం వేగంగా స్థిరీకరించాలని నొక్కి చెప్పింది.

Show Full Article
Print Article
Next Story
More Stories