ప్రచారంలో నోరు అదుపులో పెట్టుకోండి...

Submitted by arun on Sat, 11/10/2018 - 11:16

తెలంగాణలో ఎన్నికల వేళ ప్రచారంలో దూసుకుపోతున్న అధికార, ప్రతిపక్షపార్టీల నాయకులు పరస్పర మాటల యుద్ధంతో రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. అయితే ఒకరిపై మరొకరు వ్యక్తిగత దూషణలు, అసభ్య పదజాలాన్ని ఉపయోగించడంపై వచ్చిన ఫిర్యాదులతో ఈసీ కన్నెర్ర జేసింది. ఈ మేరకు పలువురు నేతలకు నోటీసులు జారీ చేసి వివరణ కోరింది. 

తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లు, ప్రచార తీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ శుక్రవారం రాజకీయ పార్టీలతో సమావేశమైంది ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయంలో ఈసీ రజత్ కుమార్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో పార్టీలకు పలు సూచనలు చేసింది.

ఇక ఇప్పటికే కోడ్ ఉల్లంఘనకు, వ్యక్తిగత దూషణలకు సంబంధించి అనేక ఫిర్యాదులు అందిన నేపథ్యంలో పలువురు నేతలకు ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది.. అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో టీఆర్ఎస్ నేత హరీష్ రావు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ గజ్వెల్ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నేత రేవూరి ప్రకాశ్ రెడ్డిలకు ఈసీ నోటుసులు ఇచ్చింది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై హరీష్ రావు అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు హరీష్ రావు పైన ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఈసీ నోటీసులు జారీ చేసింది. కేసీఆర్, టీఆర్ఎస్ నేతలపై రేవంత్ రెడ్డి, వంటేరు ప్రతాప్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారని, పరుషపదజాలం ఉపయోగించారని టీఆర్ ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఇందుకుగాను వీరికి నోటీసులు ఇచ్చింది. ఇటీవల టీడీపీ నేత రేవూరి కూడా హరీష్ రావు, కేసీఆర్‌లపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇందుకు ఆయనకు నోటీసులు పంపించారు. 48 గంటల్లో వివరణ కోరింది. మొత్తానికి ప్రచారంలో దూసుకుపోతున్న నేతలు ఇష్టానుసారం దూషనలకు దిగకుండా ఉండేందుకు ఈసీ చర్యలు తీసుకుంటోంది. 

English Title
EC Sends Notice to Harish Rao & Revanth Reddy

MORE FROM AUTHOR

RELATED ARTICLES