నట్స్ తినండి..యంగ్‌గా కనిపించండి..

నట్స్ తినండి..యంగ్‌గా కనిపించండి..
x
Highlights

బ్లూ, బ్లాక్ బెర్రీస్ తీసుకుంటే వృద్ధాప్య ఛాయలు తగ్గిపోతాయి. మైదా, ఉప్పు, పంచదారను బాగా తగ్గిస్తే చర్మ సమస్యలుండవు. అవకాడో శరీరంలో ఉన్న అధిక కొవ్వును...

బ్లూ, బ్లాక్ బెర్రీస్ తీసుకుంటే వృద్ధాప్య ఛాయలు తగ్గిపోతాయి. మైదా, ఉప్పు, పంచదారను బాగా తగ్గిస్తే చర్మ సమస్యలుండవు. అవకాడో శరీరంలో ఉన్న అధిక కొవ్వును తగ్గిస్తుంది, ఇందులోని విటమిన్ ఇ వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తాయి. నట్స్‌ని తీసుకోవడం ద్వారా చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. నట్స్‌ను తేనెలో నానబెట్టి పరిగడపున తిన్నట్లయితే ఆరోగ్యంగా ఉంటారు. వాల్‌నట్స్ తీసుకోవడం, క్యాబేజీ, బ్రకోలీ, మొలకలు లాంటివి శరీరంలో ఏర్పడే టాక్సిన్లతో పోరాడి ఏజింగ్ లక్షణాలను దూరం చేస్తాయి. నట్స్ రోగనిరోధక శక్తిని పెంచి చర్మం పొడిబారడాన్ని నివారిస్తాయి.

పుచ్చకాయలో ఉండే విటమిన్ ఎ, బి, సిలు ఫ్రీ రాడికల్స్‌తో పొరాడి చర్మం మెరిసేందుకు ఉపయోగపడతాయి. ముల్లంగి, టర్నిప్‌లు యాంటీ ఏజింగ్ లక్షణాలను నివారణలో అదుేతంగా పనిచేస్తాయి. విటమిన్ డి యాంటీ ఏజింగ్‌గా పనిచేస్తూ ఆస్టియోఫోరోసిస్‌ను నివారిస్తుంది. ఎండవల్ల వచ్చే అతినీలలోహిత కిరణాల ప్రభావాన్ని విటమిన్ ఎ నివారిస్తుంది. ఇది క్యారెట్, బ్రకోలి, టమాటో వంటి వాటిల్లో లభిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories