గులభీదళ సభ వేళ, సమావేశమేలా?

Submitted by arun on Sat, 09/01/2018 - 13:11
Early polls

ప్రగతి నివేదన గులభీదళ సభ వేళ

గంట ముందే ప్రత్యెక  సమావేశ మేలా?

కేబినెట్‌ భేటీ నిర్వహించుకొని అలా,

బహిరంగ సభకి బయలుదేరుతారట యిలా,

ఎన్నో వార్తలకి ఇక ఇది ఒక మేళ. శ్రీ.కో     


ప్రగతి నివేదన సభకు ఒక రోజు ముందు లేదా ఒక రోజు తరువాత కేబినెట్‌ భేటీ నిర్వహించుకునే అవకాశం ఉన్నా బహిరంగ సభ ప్రారంభానికి గంట ముందే ఈ సమావేశం జరగనుండటం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొన్ని కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపడంతోపాటు అసెంబ్లీని రద్దు చేస్తూ తీర్మానం చేయవచ్చని జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రగతిభవన్‌లో తెలంగాణ కేబినెట్ సమావేశం సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు జరగనుంది.

English Title
Early polls: Telangana CM convenes cabinet meet on Sept 2

MORE FROM AUTHOR

RELATED ARTICLES