logo

ఎన్నికల పొద్దు

ఎన్నికల పొద్దు

ఉహించినట్టుగానే తెలంగాణ అసెంబ్లీ రద్దు,

ఇక కేసీఆర్ తెచ్చారు ఎన్నికల పొద్దు,

ఏకవ్యాక్య తీర్మానంతో కేబినెట్ సుద్దు,

105 మంది అభ్యర్థులకి టికెట్ ముద్దు. శ్రీ.కో.


చాలా మంది ఉహించినట్టుగానే తెలంగాణ అసెంబ్లీని ముఖ్యమంత్రి కేసీఆర్ రద్దు చేశారు. ఏకవ్యాక్య తీర్మానంతో కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత, సీఎం, మంత్రులు బస్సులో రాజ్ భవన్ వెళ్లి తీర్మానాన్ని గవర్నరు కు సమర్పించారు. తెలంగాణ అసెంబ్లీ రద్దుపై గత కొద్ది రోజులుగా బోలెడు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఇక అసెంబ్లీ రద్దు నేపథ్యంలో కేసీఆర్ ఆపద్ధర్మ సీఎంగా కొనసాగనున్నారు. కేబినెట్ కూడా అలాగే కొనసాగనుంది. అలాగే తెరాస నుంచి 105 మంది అభ్యర్థుల ప్రకటన కూడా చేసారు.

లైవ్ టీవి

Share it
Top