logo

తెలంగాణ అసెంబ్లీ రద్దుకు ముహుర్తం ఫిక్స్‌ ...?

తెలంగాణ అసెంబ్లీ రద్దుకు ముహుర్తం ఫిక్స్‌ ...?

త్వరలో జరగబోయే నాలుగు రాష్ట్రాల ఎన్నికలతో తెలంగాణలో కూడా ఎన్నికలు నిర్వహించేలా వ్యూహరచన చేస్తున్న కేసీఆర్ అందుకు అనుగుణంగానే పావులు కదుపుతున్నారు. ప్రస్తుతమున్న అవకాశాల ప్రకారం సెప్టెంబర్ 10లోగా ప్రభుత్వాన్ని రద్దు చేస్తేనే ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలున్నాయి. ఎన్నికల నిర్వాహణకు ఎన్నికల కమిషన్‌కు వంద రోజుల వరకు సమయం అవసరమవుతుంది. రాజ్యాంగ నియమాల ప్రకారం ఆరు నెలలలోపు ప్రజా ప్రభుత్వం ఏర్పడాలి. ఈ లెక్కన మిజోరాంలో ఎన్నికల ప్రక్రియ డిసెంబర్ 15 నాటికి పూర్తి కావాలి . ఈ లెక్కన సెప్టెంబర్ 10 లోపు అసెంబ్లీ రద్దు చేసినప్పుడే ఎన్నికలు సాధ్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ముందస్తు ఎన్నికలకు అవకాశాలు ఉన్న ప్రభుత్వ రద్దు చేయడం సుదీర్ఘమైన ప్రక్రియగా ఉంది. సీఎస్ ద్వారా అజెండా వచ్చిన తరువాత కేబినె‌ట్ అధికారంగా సమావేశమయ్యి అసెంబ్లీ రద్దు తీర్మానం చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. దీన్ని సీఎస్‌ గవర్నర్‌కు వివరించిన తరువాత కేంద్రం ఆదేశం మేరకు ప్రభుత్వం రద్దవుతుంది. ప్రస్తుత అవకాశాల ప్రకారం సెప్టెంబర్ రెండు వరకు కేబినెట్ రద్దు చేసే అవకాశం లేనట్టే. తరువాత కూడా అసెంబ్లీని నిర్వహించి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ లెక్కన సెప్టెంబర్ 10 లోపు జరగాలంటే ఐదు రోజులు పాటు మాత్రమే శాసనసభ నిర్వహించే వీలుంది. అనంతరం ఏమాత్రం ఆలస్యమైన అసలుకే మోసం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

లైవ్ టీవి

Share it
Top