హామీ ఇచ్చారు.. నిలబెట్టుకోండి!

హామీ ఇచ్చారు.. నిలబెట్టుకోండి!
x
Highlights

నీతి ఆయోగ్ మీటింగ్‌లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కీలక ప్రసంగం చేశారు. విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చి...

నీతి ఆయోగ్ మీటింగ్‌లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కీలక ప్రసంగం చేశారు. విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని బల్లగుద్దిమరీ చెప్పారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఆవశ్యకతను వివరించిన సీఎం జగన్‌..... హామీ ఇచ్చారు... నిలబెట్టుకోండంటూ కేంద్రాన్ని కోరారు. 59శాతం జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు 47శాతం ఆదాయాన్ని పంచారని, అలాగే హైదరాబాద్‌.... తెలంగాణకు వెళ్లడం వల్ల... ఏపీ తీవ్రంగా నష్టపోయిందని జగన్ వివరించారు.

ఆ నష్టాన్ని పూడ్చడానికి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు కానీ ఆ హామీని అప్పటి అధికార, విపక్ష పార్టీలేవీ నిలబెట్టుకోలేదన్నారు. విభజన నాటికి రూ. 97 వేల కోట్లు ఉన్న అప్పు నేటికి రూ. 2.59 లక్షల కోట్లకు చేరిందని.. అప్పుల్లో అసలు, వాటిపై వడ్డీలకు కలిపి ఏటా రూ. 40వేల కోట్ల భారం పడుతోందని నీతి అయోగ్ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా ఉపాధి కల్పన పడిపోవడంతో యువత వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రత్యేక హోదా మాత్రమే రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని పూడ్చగలదని జగన్ కోరారు.

నీతి అయోగ్‌కు నిశితంగా వివరించా..!

"రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకుని ప్రత్యేక హోదా ఇవ్వాలి. హోదా ఇస్తేనే రాష్ట్రం నిలదొక్కుకుంటుంది. ఈ సందర్భంగా నివేదికను సమర్పించడం జరిగింది. రెవెన్యూ లోటు భర్తీ, ప్రత్యేక హోదా ఆవశ్యకతను వివరించాను. 14వ ఆర్థిక సంఘం 2015-20 మధ్య రెవెన్యూ లోటు రూ.22, 113 కోట్లుగా అంచనావేసింది. గత ఐదేళ్లలో తెలంగాణకు రూ. 1.18 లక్షల కోట్లు రెవెన్యూ మిగిలి ఉంది. వాస్తవానికి గత ఐదేళ్లలో ఏపీ రెవెన్యూ లోటు రూ. 66,362 కోట్లు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. 2015-16లో తెలంగాణ తలసరి ఆదాయం రూ. 14,414 కాగా.. ఏపీలో తలసరి ఆదాయం రూ. 8,397 మాత్రమే. రాష్ట్ర విభజన సమయంలో హోదా ఇస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. 2014 బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా ప్రస్తావన ఉంది. హోదా లభిస్తేనే రాష్ట్రానికి పెట్టుబడులు, మౌలిక వసతులు సమకూరుతాయి. హైదరాబాద్ ఎంతో ఆర్థికంగా అభివృద్ధి చెందిన నగరం. ఏడాదికి రూ. 20వేల కోట్ల వడ్డీ.. రూ. 20వేల కోట్ల అసలు చెల్లించాల్సి వస్తుంది. రాష్ట్రంలో పారిశ్రామికీకరణ లేదు. చేతి వృత్తులు, ఉపాధి అవకాశాలు భారీగా తగ్గిపోయాయి" అని నీతి అయోగ్ సమావేశంలో వైఎస్ జగన్ నిశితంగా వివరించారు. కాగా.. ఈ సమావేశానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌, బెంగాల్‌ సీఎం మమత హాజరు కాలేదు

ప్రత్యేక హోదా ఆవశ్యకతను వివరిస్తూ ... విభజన చట్ట హమీలను ప్రస్తావించారు. అలాగే, నీతిఆయోగ్ ఎదుట రాష్ట్రంలో రెవిన్యూ లోటును గణాంకాలతో వివరించారు. ఏపీ వనరులను తెలియజేస్తూ, ఆర్ధిక పరిస్ధితిని వివరించారు.విభజన చట్ట హామీలు, ప్రత్యేక హోదా, రెవెన్యూలోటు అంశాలను గణాంకాలతో పాటు వివరించారు. 98 పేజీల నివేదికను సమావేశంలో అందజేశారు. 14వ ఆర్ధిక సంఘం లెక్కల ప్రకారం 2015-20 మధ్య 22 వేల 113 కోట్ల రెవిన్యూ ఉందన్నారు. ఇదే సమయంలో పొరుగున ఉన్న తెలంగాణకు లక్షా 18 వేల కోట్ల రెవిన్యూ మిగులు ఉందన్నారు.

వాస్తవానికి గత ఐదేళ్లలో 66 వేల 362 కోట్ల రెవిన్యూ లోటు ఉందని సీఎం జగన్ వివరించారు. రాష్ట్రంలో పూర్తి స్ధాయి పారిశ్రామికరణ లేకపోవడం .. వ్యవసాయంపైనే అధిక శాతం ప్రజలు ఆధారపడి జీవిస్తూ ఉండటంతో ఇప్పటికప్పుడు ఆదాయం పెరిగే మార్గాలు లేవన్నారు. అత్యంత కీలకమైన ఐటీ సెక్టార్ తెలంగాణకే పరిమితమైనందున ... ప్రస్తుత పరిస్ధితుల్లో ఏపీకి ప్రత్యేక హోదా ఎంతో ఆవసరమన్నారు.

విభజన నాటి పరిస్ధితులను ప్రస్తావించిన జగన్ 59 శాతం జనాభా ఉన్న ఏపీకి 47 శాతం ఆదాయం మాత్రమే ఇచ్చారన్నారు. విభజన నాటికి 97 వేల కోట్లుగా ఉన్న అప్పుడు ప్రస్తుతం 2 లక్షల 59 వేల కోట్లకు చేరాయన్నారు. అప్పుల్లో అసలు, వడ్డీ చెల్లించేందుకే ఏడాదికి 40 వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తోందన్నారు. నీతి అయోగ్ ఏర్పడే వరకు ప్రత్యేక హోదాకు ఎలాంటి అడ్డంకులు లేని విషయాన్ని గతంలోనూ కేంద్ర ప్రభుత్వం చెప్పిందన్నారు. ఏపీలోని ప్రత్యేక పరిస్ధితులను బట్టి పెద్ద మనసుతో ఆదుకోవాలంటూ ప్రధానితో పాటు ఇతర కేంద్ర మంత్రులను కోరారు.

నీతి అయోగ్ సమావేశంలో టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను కూడా జగన్ ప్రస్తావించారు గత ఐదేళ్లలో అవినీతితో కూడిన దుష్పరిపాలన, చిత్తశుద్ధి లేని తీరుతో రాష్ట్రంలో నిరుద్యోగం భారీగా పెరిగిందన్నారు. దీని వల్ల మౌలిక రంగాల్ల పెట్టుబడులు లేమి , విద్యా, వైద్య రంగాల్లో పతనావస్ధ పెరిగిపోయాయన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories