యాంకర్ కానున్న రామ్ చరణ్..

యాంకర్ కానున్న రామ్ చరణ్..
x
Highlights

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ని మనం ఇప్పటివరకు ఓ హీరోగా చూసాం ఓ నిర్మాతగా చూసాం కానీ చరణ్ ఇప్పుడు మరో అవతారం ఎత్తనున్నాడు అదే యాంకర్ .. ప్రస్తుతం...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ని మనం ఇప్పటివరకు ఓ హీరోగా చూసాం ఓ నిర్మాతగా చూసాం కానీ చరణ్ ఇప్పుడు మరో అవతారం ఎత్తనున్నాడు అదే యాంకర్ .. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం సైరా నరసింహ రెడ్డి. దీనికి సురేందర్ రెడ్డి దర్శకుడు ..రామ్ చరణ్ నిర్మాత . కొణిదెల ప్రొడక్షన్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది . ఈ సినిమాని 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు . సినిమా ప్రమోషన్ ని పక్కా ప్రణాళికతో సిద్దం చేసారట చిత్ర యూనిట్ ..

అందులో భాగంగానే చరణ్ యాంకరింగ్ అవతారం ఎత్తనున్నాడు . సైరా టీం లో ఒక్కొక్కరిని చరణ్ ఇంటర్వ్యూ చేస్తారు. అందులో మొదటగా చరణ్ , చిరంజీవిని చరణ్ ఇంటర్వ్యూ చేస్తారు . ఇలా ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేసిన వీడియోలను బయటకు వదులుతారు . దీనితో సినిమా ప్రొమోషన్ బాగా జరుగుతుందని చిత్ర యూనిట్ భావిస్తుందట ..

ప్రస్తుతం చరణ్ రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR షూటింగ్ లో బిజీ బిజీ గా ఉన్నాడు . ఈ సినిమా గ్యాప్ లో చరణ్ సైరా సినిమా ప్రమోషన్ లో పాల్గొంటాడు . ఈ సినిమాని అక్టోబర్ రెండున గాంధీ జయంతి సందర్భంగా విడుదలకి సిద్దం చేస్తున్నారు .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories