సీఎం ర‌మేష్ వాట్స‌ప్ ఎందుకు స్తంభించిది...సీఎం ర‌మేష్ చేసిన పొరపాటు ఏంటి?

సీఎం ర‌మేష్ వాట్స‌ప్ ఎందుకు స్తంభించిది...సీఎం ర‌మేష్ చేసిన పొరపాటు ఏంటి?
x
Highlights

ఉన్నట్టుండి వాట్సాప్‌ గ్రూపులు ఆగిపోతే..? అసలు వాట్సాప్‌ మెసెంజరే పనిచేయకపోతే..? అదే పరిస్థితి ఏపీ టీడీపీ నేతల్లో ఎదురవుతుంది..? ఎవరూ కంప్లైంట్‌...

ఉన్నట్టుండి వాట్సాప్‌ గ్రూపులు ఆగిపోతే..? అసలు వాట్సాప్‌ మెసెంజరే పనిచేయకపోతే..? అదే పరిస్థితి ఏపీ టీడీపీ నేతల్లో ఎదురవుతుంది..? ఎవరూ కంప్లైంట్‌ చేశారో ఏమని కంప్లైంట్‌ చేశారో తెలియకుండా వరుసగా వాట్సాప్‌ మెసెంజర్‌లు బ్లాక్‌ అవుతున్నాయి. అందులో తొలి బాధితుడు ఎంపీ సీఎం రమేష్‌.

టీడీపీ నేత‌ రాజ్య‌స‌భ స‌భ్యుడు అయిన సీఎం ర‌మేష్ కు విచిత్ర అనుభ‌వం ఎదురైంది. వాట్స‌ప్ స‌మాచారం ప‌రుగులు పెడుతున్న వేళ‌ ఆ సంస్థ ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. సీఎం రమేష్‌‌కు చెందిన వాట్స్‌ప్ అకౌంట్‌పై ఆ సంస్థ వేటు వేసింది. ఆయన ఖాతాను నిషేధించింది. సీఎం రమేష్‌కు వాట్సాప్ సేవలను వాడుకునే హక్కును కోల్పోయారని ఆ సంస్థ వివరించింది.

కొద్దిరోజులుగా సీఎం రమేష్ వాట్సాప్ ఖాతా పనిచేయడం లేదు. దీనిపై ఆయన వివరణ కోరుతూ వాట్సాప్ సంస్థకు లేఖ రాశారు. అందుకు బదులుగా ఆ సంస్థ నిబంధనలు ఉల్లంఘించారని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. నిబంధనల ఉల్లంఘనలపై ఫిర్యాదులు అందాయని వాట్సాప్‌ సంస్థ పేర్కొంది. అయితే దీని వెనుక కేంద్ర ప్రభుత్వ కుట్ర ఉందని సీఎం రమేష్‌ ఆరోపించారు. ఇప్పుడు ఈ వ్య‌వ‌హారం ఏపీ టిడిపి వ‌ర్గాల్లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

అస‌లు సీయం ర‌మేష్ వాట్స‌ప్ ఎందుకు స్తంభించిది. ఆయ‌న ఏం చేసారు ఆయ‌న పై ఎవరు ఫిర్యాదు చేసారు..? ఏ మని చేసారు..? ఇప్పుడు ఈ ప్ర‌శ్న‌లు అంద‌రిలోనూ మొద‌ల‌య్యాయి. వాట్స‌ప్ అన్న‌ది ఇప్పుడు ప్ర‌తీ ఒక్కిరి స‌ర్వ సాధార‌ణంగా మారిపోయింది. రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్న ఓ కీల‌క వ్య‌క్తికి సంబంధించిన ఖాతాను ఆషామాషీగా క్లోజ్ చేయ‌రు. దీనికి బ‌ల‌మైన కార‌ణాలు అంత కంటే బ‌ల‌మైన ఆధారాలు ఉంటే మిన‌హా వాట్స‌ప్ సంస్థ ఇటువంటి నిర్ణ‌యం తీసుకొనే అవ‌కాశం ఉండ‌ద‌ని నిపుణులు చెబుతున్న మాట‌.

మరోవైపు అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జెసి పవన్ కుమార్ రెడ్డి వాట్సాప్ ఐదు రోజులుగా పని చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా వాట్సాప్ పని చేయకుండా నిలిపివేశారని చెప్తున్నారు.

వీళ్లిద్దరే కాదు రాజకీయ నేతల్లో మూడో వ్యక్తి వాట్సాప్‌ ఖాతా కూడా బ్లాక్‌ అయ్యింది. కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి వాట్సాప్‌ను బ్యాన్‌ చేసింది ఆ సంస్థ. దీంతో కేవలం ఏపీ టీడీపీ లీడర్ల వాట్సాప్‌లే బ్లాక్‌ అవుతున్నాయని, ఇదంతా కేంద్ర ప్రభుత్వ చర్యగా టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories