దుబాయ్‌లో కేసుల ప్రాసిక్యూషన్‌ ఎలా ఉంటుందంటే

దుబాయ్‌లో కేసుల ప్రాసిక్యూషన్‌ ఎలా ఉంటుందంటే
x
Highlights

దుబాయ్‌లో కేసుల ప్రాసిక్యూషన్‌ ఎలా ఉంటుంది ? ఏదైనా కేసును పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌‌కు బదిలీ చేస్తే అక్కడ విచారణ ప్రత్యేకంగా ఉంటుందా ? శ్రీదేవి మృతితో...

దుబాయ్‌లో కేసుల ప్రాసిక్యూషన్‌ ఎలా ఉంటుంది ? ఏదైనా కేసును పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌‌కు బదిలీ చేస్తే అక్కడ విచారణ ప్రత్యేకంగా ఉంటుందా ? శ్రీదేవి మృతితో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయ్. పోలీసుల ఇన్వెస్టిగేషన్‌ పూర్తయినా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల విచారణ విభిన్నంగా ఉంటుందా ?

లెజండరీ యాక్ట్రెస్‌ శ్రీదేవి కేసును ఆర్టికల్ 35 క్రిమినల్‌ కోడ్‌ కింద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ అధికారులు విచారిస్తున్నారు. దుబాయ్‌ చట్టాల గురించి భారత ములాలున్నా అక్కడి న్యాయవాది బిని సరోజ్‌ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. స్థానిక పోలీసుల ఇచ్చిన సమాచారంతో జూడిషియల్ పోలీసులు కేసును లోతుగా విచారిస్తారు. దీంతో పాటు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌, ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌లను పరిగణలోకి తీసుకుంటారని సరోజ్ తెలిపారు. భారత్‌లో కేసు విచారణ మొత్తం పోలీసులు చేస్తే దుబాయ్‌లో మాత్రం పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లకు అన్ని కోణాల్లో విచారించే హక్కు ఉంటుంది.

కేసులో అనుమానాలు వస్తే పబ్లిక్‌ ప్రాసిక్యూషన్ డిపార్ట్‌మెంట్‌ మృతి చెందిన వ్యక్తి కుటుంబసభ్యులను పిలిపిస్తుంది. పోలీసుల విచారణ, ఫోరెన్సిక్‌ రిపోర్ట్, పోస్ట్‌మార్టం రిపోర్టుల ఆధారంగా కేసును విచారిస్తుంది. ఈ విచారణను ప్రత్యక్షంగానైనా లేదా పరోక్షంగానైనా చేసే అధికారం పబ్లిక్ ప్రాసిక్యూషన్‌ ఆఫ్‌ దుబాయ్‌ అధికారులకు ఉంటుంది. శ్రీదేవి కేసులో మొదట లోకల్ పోలీసులు విచారించారు. తర్వాత పోస్టుమార్టం రిపోర్ట్, ఫోరెన్సిక్‌ రిపోర్టులు వచ్చాక దుబాయ్‌ పబ్లిక్ ప్రాసిక్యూషన్‌ విచారించి తదుపరి చర్యలు తీసుకుంటుంది.

దుబాయ్ నుంచి డెడ్‌బాడీని ఇతర దేశాలకు తరలించాలన్నా నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్లు ఇవ్వాల్సింది పబ్లిక్ ప్రాసిక్యూటర్లే. విచారణలో ఏవైనా అనుమానాలుంటే మాత్రం సాక్ష్యాలను సేకరించి కోర్టుకు పంపుతుంది. దీంతో పాటు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ కూడా ఎగ్జామిన్ చేస్తుంది. అక్కడితో కేసు విచారణ ముగియదు. హైప్రొఫైల్‌ ఉన్న వ్యక్తులకు రెండోసారి పోస్ట్‌మార్టంకు ఆదేశించే అధికారం ఉంటుంది. మొదటి పోస్ట్‌మార్టం, రెండో పోస్టుమార్టం నివేదికలు సరిపోలితే డెడ్‌బాడీకి క్లియరెన్స్‌ వస్తుంది. లేదంటే వివిధ కోణాల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు విచారిస్తారు.

పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు క్లియరెన్స్ ఇస్తే అందుకు సంబంధించిన నివేదికలు దుబాయ్‌లోని జనరల్‌ కాన్సులేట్‌కు వెళ్తుంది. అక్కడ ఫైనల్‌ ప్రొసిజర్‌ను కంప్లీట్ చేసిన తర్వాత హైప్రొఫైల్‌ ఉన్న వ్యక్తుల డెడ్‌బాడీని స్వదేశాలకు తరలిస్తారు. దుబాయ్‌ చట్టాలను, అధికారులను ఎవరూ ఇన్‌ఫ్లూయన్స్‌ చేయలేరు. దుబాయ్‌ చట్టాలు ఇంతకఠినంగా ఉన్నాయి కాబట్టే శ్రీదేవి డెడ్‌బాడీని ఇండియాకు తీసుకురావడంలో ఆలస్యమవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories