మందుబాబుల గూండాగిరి...ఎమ్మెల్సీ కొడుకు అని...

Submitted by arun on Wed, 08/15/2018 - 13:46

శ్రీశైలం సమీపంలోని సున్నిపెంటలో ముగ్గురు మందు బాబులు హల్ చల్ చేశారు. డ్యూటీలో ఉన్న ఫారెస్ట్ ట్రైనింగ్ ఆఫీసర్ ను చితకబాదారు. అతడిని బూతులు తిట్టి కాళ్లు మొక్కించుకుని వదిలేశారు. తాము హైదరాబాద్ కు చెందినవారమని, తమ ముగ్గురిలో ఒకడు ఎమ్మెల్సీ కొడుకు అని బెదిరించారు.

హైదరాబాద్ కు చెందిన ముగ్గురు వ్యక్తులు కార్లలో శ్రీశైలం వస్తున్నారు. అర్ధరాత్రి దారి మధ్యలో సున్నిపెంట గ్రామంలో రోడ్డుపై మద్యం సేవిస్తున్నారు. ఇది గమనించిన  ఫారెస్ట్ ట్రైనింగ్ ఆఫీసర్ జ్యోతి స్వరూప్ రోడ్డుపై మద్యం తాగరాదని మందలించారు. అంతే ముగ్గురు మందుబాబులు రెచ్చిపోయారు. ట్రైనింగ్ ఫారెస్ట్ ఆఫీసర్ ను పోలీసు స్టేషన్ పోదాం రా అని ముగ్గురు యువకులు బలవంతం చేశారు. ఐడీ కార్డు చూపించమని డిమాండ్ చేశారు. కాళ్లకు బూట్లు ఎక్కడవని ప్రశ్నించారు. ఉదయం నా ఐడీ కార్డు చూపిస్తానని  ట్రైనింగ్ ఫారెస్ట్ ఆఫీసర్ వేడుకున్నా వినిపించుకోలేదు. పీఎస్ వెళుదామని కారులో ఎక్కించుకునేందుకు ప్రయత్నం చేశారు.

ముగ్గురు వ్యక్తుల్లో ఒకడు  ట్రైనింగ్ ఫారెస్ట్ ఆఫీసర్ చెంపలను ఎడాపెడా గట్టిగా వాయించాడు. బూతులు తిడుతూ డ్రెస్ ఎవరిదని ప్రశ్నించాడు. కాళ్లు మొక్కమని బెదిరించారు. మా ముగ్గెరిలో ఒకడు ఎమ్మెల్సీ కొడుకు అని చెప్పారు. తనది తప్పు అయిందని  ఫారెస్ట్ ట్రైనింగ్ ఆఫీసర్ వేడుకున్నా వినిపించుకోలేదు. ఎమ్మెల్సీ కుమారుడి కాళ్లను ట్రైనింగ్ ఆఫీసర్ చేత మొక్కించి వదిలేశారు. బాధిత ట్రైనింగ్ ఫారెస్ట్ ఆఫీసర్ పిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 
 

Tags
English Title
Drunken Boys Hulchul In Srisailam

MORE FROM AUTHOR

RELATED ARTICLES