డ్రగ్స్‌ కేసులో ఆ ముగ్గురు ఎవరు?

Submitted by arun on Sat, 04/07/2018 - 11:41
Tollywood actors

డ్రగ్స్ కేసులో ముగ్గురు సినీ ప్రముఖులపై అభియోగాలను నమోదు చేస్తూ సిట్‌ చార్జిషీట్‌ దాఖలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం స్పష్టించిన ఈ కేసులో ఎక్సైజ్ శాఖ విచారణ సందర్భంగా వెల్లడైన అంశాలతో పాటు ఫోరెన్సిక్  నివేదిక ఆధారంగా వీరిపై అభియోగాలు నమోదు చేశారు. చార్జ్ షీట్ లో ముగ్గురు ప్రముఖులపై అభియోగాలు నమోదు చేయడంతో వీరెవరనేది ఆసక్తిగా మారింది. 

డ్రగ్స్‌ కేసులో సినీ హీరోలు రవితేజ, తరుణ్ తో పాటు సుబ్బరాజు, ఛార్మీ, నందు, శ్యామ్ కే నాయుడు, పూరి జగన్నాథ్ విచారణ ఎదుర్కొన్నారు. వీరందరి నుంచి గోళ్లు ఇతర నమూనాలు సేకరించిన ఎక్సైజ్‌శాఖ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించింది. పరీక్షల్లో ముగ్గురి శాంపిల్స్  డ్రగ్స్ నమూనాలతో సరిపోవడంతో వీరి పేర్లను చార్జిషీట్‌లో చేర్చారు.

పోలీసులు కేసులు నమోదు చేసిన వారిలో ప్రముఖ దర్శకుడితో పాటు ఇటీవల అవకాశాల కోసం ఎదురుచూస్తున్న  ఓ హీరో ఉన్నారు. యాంగ్రీ హీరోగా గుర్తింపు పొందిన మరో నటుడి పేరు చార్జిషీట్‌లో ఉన్నట్టు సమాచారం. ఇటీవల కుటుంబ వివాదాలతో విషాదంలో కూరుకుపోయిన హీరో పేరు కూడా ఉన్నట్టు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. అయితే మరికొందరి ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌ రావాల్సి ఉండటంతో డ్రగ్స్‌ వాడుతున్న సినీ ప్రముఖుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది.  

English Title
drugs case sit filed charge sheet against tollywood celebrities

MORE FROM AUTHOR

RELATED ARTICLES