రెండు జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్...మూడో సీటు ఎవరికో..?

రెండు జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్...మూడో సీటు ఎవరికో..?
x
Highlights

తెలంగాణలో స్థానికి సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల న‌గ‌రా మోగింది. మూడు స్థానాల్లో గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాలు...

తెలంగాణలో స్థానికి సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల న‌గ‌రా మోగింది. మూడు స్థానాల్లో గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే రెండు జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ ఒక జిల్లా అభ్యర్థిని మాత్రం ఇంకా ప్రకటించలేదు దీంతో ఆ జిల్లాకు చెందిన నేతలు టికెట్ కోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్వారా పావులు కదుపుతున్నారు.

ఎమ్మెల్సీలుగా ఉన్న కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి, ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డి, కొండ ముర‌ళి రాజీనామా చేయాడంతో ఉమ్మడి న‌ల్గొండ‌, రంగారెడ్డి, వ‌రంగ‌ల్ జిల్లా స్థానిక సంస్థలకోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీపికేష‌న్ విడుదల చేసింది. టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నవీన్ రావు, నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గుత్తా సుఖేందర్ రెడ్డిని అభ్యర్థులుగా ప్రకటించింది.

ఈ రెండు జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరంగల్ జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిని మాత్రం ఇంకా ప్రకటించలేదు దీంతో టికెట్ ఆశిస్తున్న ఓరుగల్లు జిల్లా నేతల్లో ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్సీ టికెట్ ద‌క్కించుకునేంద‌కు జిల్లా నేత‌లు ప్రయాత్నాలు ముమ్మరం చేశారు. పార్టీ అధినేత అందుబాటులో లేక‌పోవాడంతో వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ద‌గ్గర అర్జిలు పెట్టుకుంటున్నారు. టికెట్ అశిస్తున్నవారిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు త‌క్కెళ్లపల్లి ర‌వీంద‌ర్ రావు ఉన్నారు. ఇక కేటీఆర్‌కి అత్యంత స‌న్నిహితుడు అయిన పోచంప‌ల్లి శ్రీనివాస్ రెడ్డి కూడా టికెట్ అడుగుతున్నారు. వీరితో పాటూ మాజీ మంత్రి, ప్రస్తుత టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి బ‌స్వరాజ్ సార‌య్య, మాజీ యంపీ గుండు సుధారాణి టికెట్ కోరుతునట్లు తెలుస్తోంది.

మరి కొంత మంది సీనియర్లు కూడా తమకు అధినేత అవకాశం ఇస్తారని భావిస్తున్నారు రంగారెడ్డి జిల్లా నుంచి పట్నం నరేందర్ రెడ్డితో ఖాళీ అయిన తన తమ్ముడి స్థానంలో టికెట్లు తనకే వస్తుందని మహేందర్ రెడ్డి ఇంకా ఆశిస్తున్నారు. తనకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి నవీన్ రావును నామినేటెడ్ కోటాలో పంపుతారని అంచనావేస్తున్నారు. నల్గొండ జిల్లాలో కూడా చిన్నప రెడ్డి, చాడా కిషన్ రెడ్డిలు చివరి వరకూ ప్రయత్నం ఆపకూడదని నిర్ణయించుకున్నారు.

మొత్తానికి మూడు ఎమ్మెల్సీ సీట్ల‌పై క‌న్నేసిన టీఆర్ఎస్ పార్టీ మూడింటిలో మూడు గెల‌వ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకుంది. రంగారెడ్డి, నల్గొండ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించిన కేసీఆర్ వరంగల్ జిల్లా నుండి ఆశావాహులు ఎక్కువగా ఉండటంతో గెలుపొందే వ్యక్తికి టికెట్ ఇవ్వాలని ఆచితూచి వేస్తున్నారు. మరి ఆ అదృష్టం ఎవరికి దక్కుతుందో వేచి చూడాలి.


Show Full Article
Print Article
Next Story
More Stories