చంద్రబాబుపై విజయసాయిరెడ్డి పంచ్‌లు

చంద్రబాబుపై విజయసాయిరెడ్డి పంచ్‌లు
x
Highlights

ఏపీ సీఎం చంద్రబాబును జాతీయ పార్టీల నేతలు ఫెవికల్ బాబుగా పిలుస్తున్నారంటూ ఎద్దేవా చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ట్విట్టర్ వేదికగా టీడీపీ నేతలపై...

ఏపీ సీఎం చంద్రబాబును జాతీయ పార్టీల నేతలు ఫెవికల్ బాబుగా పిలుస్తున్నారంటూ ఎద్దేవా చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ట్విట్టర్ వేదికగా టీడీపీ నేతలపై పదునైన పంచ్‌లు, వ్యంగాస్త్రాలు, ఘాటైనా విమర్శలు చేసే ఆయన బాబు టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. చంద్రబాబు గ్రాఫ్ పడిపోయిందనే విషయం మాయావతి, అఖిలేష్‌ కాంగ్రెస్‌ పార్టీలకు తెలిసిందన్నారు. తెలుగు ఆత్మగౌరవంతో పుట్టిన టీడీపీని సోనియా కాళ్ల దగ్గర పడేశారంటూ ఘాటుగా విమర్శించారు. పొరుగున్న తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ వినాశనాన్ని కోరుకుంటుందని బోరున విలపించిన చంద్రబాబు ఇప్పుడు చేస్తున్నదేమిటని ప్రశ్నించారు. ఎప్పుడు కలవాలో ఎప్పుడు విడిపోవాలో చంద్రబాబు కంటే వాళ్లకే ( ఉత్తరాది నేతలు, కాంగ్రెస్‌ నాయకులు) బాగా తెలుసని విజయసాయిరెడ్డి ట్విట్‌ చేశారు. ఇక మరో ట్విట్‌లో 'యూపీఏ, మాయా-అఖిలేశ్ ఫ్రంటులు చతికల పడ్డాయి. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిగారి గ్రాఫ్ ఢమాల్ అన్న విషయం కూడా వాళ్లకి అర్థమైంది. లగడపాటి సర్వేను అందరికీ చూపించబోగా విసుక్కున్నారట. పాపం అటు ఇటు కాకుండా పోయాడు బాబు అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories