'డాన్' హీరోయిన్స్ ఒకే చోట‌

Submitted by nanireddy on Tue, 09/26/2017 - 17:18

1978లో అమితాబ్ బ‌చ్చ‌న్ హీరోగా న‌టించిన హిందీ చిత్రం 'డాన్' ఘ‌న‌విజ‌యం సాధించింది. ఈ సినిమా అప్ప‌ట్లోనే తెలుగులోనూ, త‌మిళంలోనూ రీమేక్ అయ్యింది. ఇక‌, 2006లో 'డాన్' సినిమాని అదే పేరుతో షారుఖ్ రీమేక్ చేశాడు. అందులో హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా న‌టించింది. అలాగే త‌మిళంలో 2007లో ఆ సినిమాని 'బిల్లా' పేరుతో రీమేక్ చేస్తే హీరోయిన్ పాత్ర‌ని న‌య‌న‌తార చేసింది. ఈ రెండు సినిమాలు కూడా మంచి విజ‌యం సాధించాయి.

క‌ట్ చేస్తే.. 'డాన్' ముద్దుగుమ్మ‌లిద్ద‌రూ న్యూయార్క్‌లో అనుకోకుండా ఒకే చోట క‌లిశారు. న‌య‌న‌తార త‌న ప్రియుడు, ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్ పుట్టిన‌రోజు వేడుక‌ల కోసం అక్క‌డికి వెళితే.. ‘గ్లోబల్‌ గోల్స్‌ అవార్డ్‌’ కోసం ప్రియాంకా చోప్రా న్యూయార్క్‌కి వెళ్లింది. ఈ ఇద్ద‌రు క‌లిసి సినిమాలు, అమెరికా లైఫ్ స్టైయిల్ గురించి కాసేపు ముచ్చ‌టించుకున్నార‌ట‌. ఆ సంద‌ర్భంలో దిగిన ఫొటోనే ఇది.

English Title
'don' heroines in the same place

MORE FROM AUTHOR

RELATED ARTICLES