మీ ప‌నిమీరు చూసుకోండి

Submitted by lakshman on Sat, 03/03/2018 - 19:14
Renu Desai

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌పై జనసేనాని పవన్ మాజీ భార్య, సినీ నటి రేణూ దేశాయ్ మండిపడ్డారు. ''డాలర్-ఏ ఫిగర్ ఆప్ స్పీచ్'' అనే పేరుతో యూట్యూబ్‌లో రేణూ దేశాయ్ పోస్టు చేసిన కవితపై పవన్ ఫ్యాన్స్ మండిపడ్డారు. మనసు పొరల్లో సమాధి కాబడిన జ్ఞాపకాలు అంటూ.. ఆ జ్ఞాపకాలను మళ్లీ చూసుకుంటున్నానని.. ఆయన మాటలు, పదాలు, ఆయన పేరు నా మదిలో చెరిగిపోని రాతలుగా మిగిలియాంటూ ఓ కవితను రేణూ దేశాయ్ పోస్టు చేశారు. 
 
ఇప్పటికీ అవన్నీ తన మనస్సులో నిలిచిపోయాయని.. విధి అనేది ఆ జ్ఞాపకాలను మళ్లీ మళ్లీ ఎందుకు నిద్దుర లేపుతుందని.. రేణూ దేశాయ్ తన బాధను కవిత రూపంలో రాసుకుంది. కానీ ఈ కవిత పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించినవేనని.. ఇలాంటి వీడియోలు రేణూ దేశాయ్ పోస్టు చేయడం ద్వారా ఆయన వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపుతోందని పవన్ ఫ్యాన్స్ మండిపడ్డారు. 
 
రేణు దేశాయ్ వల్లే పవణ్ కల్యాణ్ రాజకీయ పార్టీలకు టార్గెట్ అవుతున్నారని ట్వీట్ చేశారు. దీంతో రేణూ దేశాయ్ పీకే ఫ్యాన్స్‌పై మండిపడ్డారు. తాను చేసిన కవిత పవన్ కల్యాణ్‌ను ఎలా టార్గెట్ చేస్తుందని ప్రశ్నించారు. మీ పని మీరు చూసుకోవాలన్నారు. తన సోషల్ మీడియాలోకి ప్రవేశించి.. ఏదో ఒకటి పోస్టు చేస్తూ.. తనను కామెంట్ చేయవద్దన్నారు. 
 
ఈ ట్వీట్‌ను కూడా రాద్దాంతం చేస్తారనే విషయం తెలుసునని రేణూ చెప్పారు. సగం నాలెడ్జ్‌తో మీరు ట్వీట్లు చేస్తారని, మీరు ఏదో చెబితే, మీడియా దాన్ని పూర్తిగా హైలైట్ చేస్తోందని విమర్శించారు. పవన్ గురించి ఎలాంటి విషయాలు సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని కోరారు.

English Title
Dolor; A Figure Of Speech | Renu Desai

MORE FROM AUTHOR

RELATED ARTICLES