తెగిన కాలునే దిండుగా పెట్టారు…

తెగిన కాలునే దిండుగా పెట్టారు…
x
Highlights

ఆయనో డాక్టర్. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సంయమనం కోల్పోకుండా వైద్యం అందించాలి. తన పరిమితుల్లో రోగికి ఉన్నతమైన సేవలు అందించాలి. బాధితులను ప్రాణాపాయం...

ఆయనో డాక్టర్. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సంయమనం కోల్పోకుండా వైద్యం అందించాలి. తన పరిమితుల్లో రోగికి ఉన్నతమైన సేవలు అందించాలి. బాధితులను ప్రాణాపాయం నుంచి కాపాడాలి. కానీ.. వైద్య వృత్తికే అవమానం కలిగేలా ఉత్తరప్రదేశ్ లోని ఓ డాక్టర్ ప్రవర్తించాడు. చివరికి.. విధుల నుంచి సస్పెండ్ అయ్యాడు.

యూపీలోని ఝాన్సీలో ఓ వాహన క్లీనర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని దగ్గర్లోని.. మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ డ్యూటీలో ఉన్న డాక్టరు.. ఆ క్లీనర్ కు చికిత్స చేశాడు. ప్రమాదం తీవ్రంగా ఉండడంతో కాలును కూడా తొలగించాడు. చివరికి ఆ తొలగించిన కాలునే.. ఆ రోగికి తలగడలా పెట్టేశాడు.

ఈ విషయంపై.. బాధితుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి ఫిర్యాదు చేయడంతో.. వైద్యం చేసిన ఆ డాక్టర్ ను కాలేజీ నిర్వాహకులు విధుల నుంచి తప్పించారు. నలుగురు సభ్యుల కమిటీని వేసి విచారణకు ఆదేశించారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా.. ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నివేదికకు ఆదేశించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories