పరీక్షలో ఫెయిలైనందుకు యువ వైద్యురాలు ఆత్మహత్య
తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజీలో పీజీ స్టూడెంట్ శిల్ప ఆత్మహత్యకు పాల్పడింది. గతంలో తనను వేధిస్తున్నారంటూ ముగ్గురు ప్రోఫెసర్లపై ఆమె గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం జరిగిన పీజీ పరీక్షలో శిల్పా ఫెయిల్ అయ్యారు. అయితే తనను కావాలనే ఫెయిల్ చేశాంరటూ ఆరోపించిన శిల్పా రీవాల్యూయేషన్ కోసం ధరఖాస్తు చేసుకున్నారు. ఇందులో కూడా ఫెయిల్ కావడంతో తీవ్ర మనోవేదనకు గురైనట్టు సమాచారం. ఈ నేపధ్యంలోనే సొంతూరు పీలేరు చేరుకున్న ఆమె ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. శిల్ప ఆత్మహత్యపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. నిన్న సాయంత్రం విడుదలైన పీజీ ఫలితాల్లో శిల్ప ఫెయిల్ అయింది. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని భావిస్తున్నారు. గవర్నర్‌కు ఫిర్యాదు చేశారనే కోపంతోనే కావాలని ప్రొఫెసర్లు ఫెయిల్ చేశారని, ఆ బాధతోనే శిల్ప ఆత్మహత్య చేసుకుందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లైవ్ టీవి
నాటకమైన, సినిమా అయిన ఈయన స్టైల్ వేరు
18 Feb 2019 10:19 AM GMTసినిమా కథలో మలుపులాగానే సంగీత దర్శకుడి జీవితం
18 Feb 2019 10:15 AM GMTసరిహద్దున నువ్వు లేకుంటే ఓ సైనిక!
18 Feb 2019 9:52 AM GMTపుణ్యభూమి నా దేశం నమో నమామీ!
18 Feb 2019 9:44 AM GMTదేవ్...వావ్ అయితే కాదు...
15 Feb 2019 11:03 AM GMT