దారితప్పిన డాక్టర్ ...రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు

Submitted by arun on Fri, 06/15/2018 - 10:46

అబార్షన్లు చేయడం చట్టవిరుద్దమని తెలిసినా.. కొందరు డాక్టర్లు.. కాసులకు కక్కుర్తి పడి.. గర్భస్రావాలకు పాల్పడుతున్నారు. అనుమతి లేకుండా.. చట్టవిరుద్ద కార్యకలాపాలను కానిచ్చేస్తున్నారు. నగర శివార్లే అడ్డగా.. ప్రైవేటు క్లినిక్కులు సాగిస్తున్న దందా.. వెలుగుచూసింది. మీడియా సాక్షిగా.. ఓ ప్రైవేటు డాక్టర్ బండారం బట్టబయలైంది. 

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడీఏ బొల్లారంలో శ్రీ వల్లి ఆస్పత్రిలో.. గర్భస్రావం చేసేందుకు ప్రయత్నిస్తున్న డాక్టర్‌  శ్రీవల్లిని అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 12 వేల 500 లకు బేరం కుదుర్చుకుని.. గర్భస్రావం చేసేందుకు సిద్ధమైన సమయంలో.. అడ్డంగా దొరికింది. అయితే ఇదే సమయంలో విజువల్స్ కోసం ప్రయత్నించిన మీడియాపై డాక్టర్‌  శ్రీ వల్లి దురుసుగా ప్రవర్తించింది. కేసులు పెడతానంటూ బెదిరింపులకు పాల్పడింది. దీంతో మీడియా ద్వారా సమాచారం అందుకున్న జిల్లా వైద్యాధికారులు.. శ్రీ వల్లిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డాక్టర్ పై కేసు నమోదు చేసి.. ఆస్పత్రిని సీజ్ చేశారు. అసలు ఈ ఆస్పత్రికి గుర్తింపు లేదని వైద్యాధికారులు తేల్చారు. 

English Title
doctor caught red handed while doing abortion

MORE FROM AUTHOR

RELATED ARTICLES