స్కూళ్లో చేరిన 15 గొర్రెలు..కారణమేంటంటే..

స్కూళ్లో చేరిన 15 గొర్రెలు..కారణమేంటంటే..
x
Highlights

ఫ్రాన్స్‌లోని ఓ ప్రాథమిక పాఠశాలలో 15 గొర్రెలు స్కూల్‌లో అడ్మిషన్ తీసుకున్నాయి. అరే ఇదేంటి గొర్రెలు ఎంటీ అడ్మిషన్ ఏంటి అని ఆశ్చర్యపోకండి. అసలు కథ...

ఫ్రాన్స్‌లోని ఓ ప్రాథమిక పాఠశాలలో 15 గొర్రెలు స్కూల్‌లో అడ్మిషన్ తీసుకున్నాయి. అరే ఇదేంటి గొర్రెలు ఎంటీ అడ్మిషన్ ఏంటి అని ఆశ్చర్యపోకండి. అసలు కథ పూర్తి చదవండి. ఇక వివరాల్లోకి వెళితే ఫ్రాన్స్‌లోని ఆల్ప్స్ పర్వత శ్రేణిలో క్రెట్సిన్ బెలడోని గ్రామంలో ఓ స్కూల్ ఉంది. ఆ స్కూల్ మొత్తం 11 క్లాసులు కొనసాగుతున్నాయి. వీటిలో ఒక తరగతిలో విద్యార్థుల సంఖ్య స్పల్పంగా పడిపోయింది. 266 నుంచి 261 మందికి విద్యార్థుల సంఖ్య పడిపోతే మొత్తానికే ఆ క్లాస్‌ను మూసేస్తామని స్కూలు యాజమాన్యం తల్లిదండ్రులకు స్పష్టం చేసింది.

దీంతో ఏం చేయాలో తెలియని స్థితిలో తలిదండ్రులు ఉన్నారు. ఒక వేళ ఆ క్లాస్ మూసివేస్తే తమ విద్యార్థుల భవిష్యత్ అంధకారమవుతుందని ఆందోళన చెందారు. దీంతో ఓ ఆలోచన పుట్టుకొచ్చింది ఆ తలిదండ్రులకు ఈ క్రమంలోనే ఓ 15 గొర్రెలను తీసుకొచ్చి గొర్రెల పుట్టిన సర్టిఫికెట్స్ చూపించి అడ్మిషన్ ఇప్పించారు. ఆ గొర్రెలకు పేర్లు పెట్టి స్కూల్ రిజిస్టర్‌లో పేర్లను నమోదు చేశారు. అందులో ఒకదాని పేరు బాబేటే కాగా మరో గొర్రెకు సాటేమౌటన్ అని పేరు పెట్టారు. మొత్తానికి గొర్రెల అడ్మిషన్ ప్రక్రియ ముగిసిన తరువాత తల్లిదండ్రులు ఆనందం వ్యక్తంచేశారు. ఇక తమ పిల్లల తరగతులను రద్దుచేసే అవకాశమే ఉండదని చెప్పారు. అయితే పిల్లల సంక్షేమం కంటే జాతీయ విద్యా మండలికి విద్యార్థుల సంఖ్యే ముఖ్యమైపోయిందని తల్లిదండ్రులు మండిపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories