ప్లాస్టిక్ చెత్త సముద్రం గురించి తెలుసా మీకు

Highlights

ప్లాస్టిక్ , ప్లాస్టిక్ తో వచ్చే చెత్త వాతావరణాన్ని ఎలా కలుషితం చేస్తుందో మనకు తెలిసిందే. దీని వల్ల ఏటా కొన్ని వేలమంది మనుషులు, మూగజీవాలు ప్రాణాలు...

ప్లాస్టిక్ , ప్లాస్టిక్ తో వచ్చే చెత్త వాతావరణాన్ని ఎలా కలుషితం చేస్తుందో మనకు తెలిసిందే. దీని వల్ల ఏటా కొన్ని వేలమంది మనుషులు, మూగజీవాలు ప్రాణాలు వీడుస్తున్నాయి. కాబట్టి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే పేపర్ తో తయారు చేసే బ్యాగుల్ని ఉపయోగించాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. అయితే అలా కాగితం బ్యాగులు కాకుండా ప్లాస్టిక్ కవర్లు వాడడంతో అవి పెద్దమొత్తంలో ఒకప్రదేశంలో కలిసిపోయి సముద్రంలా తయారైంది. ఈ చెత్త సముద్రం మాది కాదంటే మాది కాదని ఓ రెండు దేశాలు కొట్టుకుంటున్నాయి.
ప్లాస్టిక్‌ పర్యావరణానికి పెద్ద సమస్య
ప్లాస్టిక్‌ పర్యావరణానికి పెద్ద సమస్యగా మారింది. ప్లాస్టిక్‌ వాడకం లేని పర్యావరణ ప్రపంచం ఆరోగ్యకరంగా ఉంటుంది. కానీ ఇది సాధ్యపడే సూచనలు ఎక్కడా కనిపించడంలేదని ప్రకృతి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 100 మిలియన్‌ టన్నుల ప్లాస్టిక్‌ ఉత్పత్తి అవుతుందని పలు సర్వేలు చెబుతున్నాయి. క్యారీబ్యాగులతో సహా ఎన్నో గృహావసరాలకు వాడి పడేస్తున్న ప్లాస్టిక్‌ భూమిలో కరిగిపోవడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది.
ప్లాస్టిక్ , ప్లాస్టిక్ తో వచ్చే చెత్త వాతావరణాన్ని ఎలా కలుషితం చేస్తుందో మనకు తెలిసిందే. దీని వల్ల ఏటా కొన్ని వేలమంది మనుషులు, మూగజీవాలు ప్రాణాలు వీడుస్తున్నాయి. కాబట్టి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే పేపర్ తో తయారు చేసే బ్యాగుల్ని ఉపయోగించాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. అయితే అలా కాగితం బ్యాగులు కాకుండా ప్లాస్టిక్ కవర్లు వాడడంతో అవి పెద్దమొత్తంలో ఒకప్రదేశంలో కలిసిపోయి సముద్రంలా తయారైంది. ఈ చెత్త సముద్రం మాది కాదంటే మాది కాదని ఓ రెండు దేశాలు కొట్టుకుంటున్నాయి.
ప్లాస్టిక్ తో వచ్చే అనార్ధాలు
ప్లాస్టిక్ సంచులని సరిగా పారవేయకపోతే, డ్రైనేజి సిస్టమ్ లోకి వెళ్ళి వాటిని మూసి వేయడం వలన అశుభ్రమైన వాతావారణాన్ని కలుగచేసి, నీటి ద్వారా వేచ్చే వ్యాధులను కలుగచేస్తాయి. పునర్వినియోగం రంగుల ప్లాస్టిక్ సంచులు, భూమిలోపలికి పోయి మట్టిని, నీటిని కలుషితం చేసే కొన్ని రసాయనాల్ని విడుదల చేస్తున్నాయి. ఆ రసాయనాల వల్ల పర్యావరణ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. మిగిలిపోయిన ఆహారం లేదా ఇతర వ్యర్ధ పదార్ధాలతో కలిసిపోయి ఉన్న కొన్ని ప్లాస్టిక్ సంచులను జంతువులు తినడం వలన హానికరమైన ప్రభావాలు కలుగుతున్నాయి. దీంతో అస్వస్థతకు గురై చనిపోతున్నాయి.
ప్లాస్టిక్ చెత్త సముద్రం
హోండురస్, గాటెమాలా దేశాల ప్రజలు ప్లాస్టిక్ వాడకాన్ని ప్రోత్సహించడంతో కొన్ని కిలోమీటర్లమేర ప్లాస్టిక్ చెత్త పేరుకుపోయి ఓ సముద్రంలా మారిపోయింది. ఆ చెత్తకు కారణం మీరంటే మీరని రెండు దేశాలూ పరస్పరం నిందించుకుంటున్నాయి. బ్రిటిష్ ఫొటోగ్రాఫర్ కారొలిన్ పవర్ ఆ వ్యర్థాల కుప్పను తన కెమెరాలో బంధించారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని సముద్రాల్లో ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఇది ఇలానే కొనసాగితే జలచరాల ఉనికికే ప్రమాదమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories