పాదయాత్రకు మహూర్తం ఖారారు చేసిన డీకే అరుణ

x
Highlights

ఏపీలో కొనసాగుతున్న పాదయాత్రల హాడావుడి తెలంగాణను తాకింది. కాంగ్రెస్ నేతలు పోటాపోటీగా పాదయాత్రలకు సిద్ధం అవుతున్నారు. అధిష్టానం అనుమతినివ్వక ముందే నడక...

ఏపీలో కొనసాగుతున్న పాదయాత్రల హాడావుడి తెలంగాణను తాకింది. కాంగ్రెస్ నేతలు పోటాపోటీగా పాదయాత్రలకు సిద్ధం అవుతున్నారు. అధిష్టానం అనుమతినివ్వక ముందే నడక మార్గానికి రూట్ మ్యాప్ ఖరారు చేసుకుంటున్నారు. ఇటీవల ముగ్గురు నేతలకు అధిష్టానం అనుమతి ఇవ్వడంతో సీనియర్లు తాము కూడ పాదయాత్ర చేస్తామంటూ విజ్ణప్తులు చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి డికే అరుణ పాదయాత్రకు ముహూర్తం సిద్ధం కావడం హాట్ టాపిక్ గా మారింది.

ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణ కాంగ్రెస్ లో పాదయాత్రల హడావిడి పెరుగుతోంది. ఎవరికీ వారు పాదయాత్రలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజాచైతన్య బస్సుయాత్ర కొనసాగిస్తున్నారు. రెండువిడతలు పూర్తి చేసుకొని మూడో విడత కు ఉత్తమ్ సిద్ధమవుతున్నాడు. ఇక గతంలోనే పార్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి , ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి , మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పాదయాత్రలకు ఢిల్లీ పెద్దలు అనుమతిచ్చారు.

ఇదే సమయంలో మాజీ మంత్రి గద్వాల జేజమ్మ తాను కూడా జూన్‌లో పాదయాత్ర ప్రారంభిస్తానంటూ ప్రకటించింది. అలంపూర్ జోగులాంబ నుంచి ఆదిలాబాద్ వరకు పాదయాత్ర చేయడానికి అనుమతినివ్వాలని అధిష్టానంతో పాటు పీసీసీని కోరింది. మహిళా నేతగా రాష్ట్ర ప్రజలందరి దగ్గర తనకు ప్రత్యేక గుర్తింపు ఉందని తన పాదయాత్రకు అనుమతినివ్వాలని పార్టీ ఇంచార్జ్ కుంతియాతో జరిగిన భేటిలో చెప్పినట్లు సమాచారం. తాను పాదయాత్ర చేయడం ద్వారా పార్టీ కార్యకర్తల్లో ఆత్మస్ధైర్యంతో పాటు మహిళల మద్దతు లభిస్తుందని అరుణ అంటున్నారు.

పాదయాత్రపై ఇప్పటి వరకు ఎవరూ బహిరంగ ప్రకటనలు చేయకపోయినా కొందరు నేతలు విభేదిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ముగ్గురు నేతలకు అనుమతిచ్చిన నేపధ్యంలో అరుణ విషయంలో ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది. దీనికి బదులుగా నేతలంతా ఉమ్మడి పాదయాత్ర చేయాలంటూ కొందరు మరో ప్రతిపాదన తెరపైకి తెస్తున్నారు. దీంతో కాంగ్రెస్ తో నడిచే కాలం నడుస్తోదంటూ ఇతర పార్టీల నేతలు గుసగుసలాడుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories