నాగంపై ఘాటు విమర్శలు చేసిన డీకే అరుణ

నాగంపై ఘాటు విమర్శలు చేసిన డీకే అరుణ
x
Highlights

నాగం జనార్దన్‌రెడ్డి టీడీపీలో బలమైన నాయకుడు కావొచ్చేమోగానీ కాంగ్రెస్‌లో కాదని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే అరుణ విమర్శించారు. గత ఎన్నికలలో...

నాగం జనార్దన్‌రెడ్డి టీడీపీలో బలమైన నాయకుడు కావొచ్చేమోగానీ కాంగ్రెస్‌లో కాదని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే అరుణ విమర్శించారు. గత ఎన్నికలలో గెలవలేని నాగం బలమైన నాయకుడు ఎలా అవుతారు?.. బలమైన నాయకుడు అంటే లావుగా ఉండడం కాదు. ఒకవేళ బలమైన నాయకుడే అయితే కాంగ్రెస్‌ పార్టీలోకి వచ్చేవారు కాదు. నాగర్‌కర్నూల్‌లో మొదటినుంచి కాంగ్రెస్‌ కి అండగా ఉన్నది దామోదర్‌రెడ్డే అని, అలాంటి నాయకుడితో అధిష్టానం సంప్రదింపులు జరపకుండా నాగం ని పార్టీలోకి తీసుకోవడం సరైన పద్ధతి కాదని అన్నారు. ఇదంతా రాజకీయ కుట్రలో భాగంగానే జరిగిందని తెలిపారు. మనస్తాపంతో దామోదర్‌రెడ్డి పార్టీ మారుతున్నట్లు తెలిసింది. ఆ నిర్ణయాన్ని మార్చుకోమని చెప్పానన్నారు. నాగర్‌కర్నూల్‌లో మొదటినుంచి కాంగ్రెస్‌కు అండగా ఉన్నది దామోదర్‌రెడ్డే అన్నారు. 2004లో కేవలం 1400 ఓట్లతోనే ఆయన ఓడిపోయారని తెలిపారు. దామోదర్‌రెడ్డి బాధను రాహుల్ దృ‌ష్టికి తీసికెళ్తామని చెప్పారు. అయినా నాగం జనార్దన్‌రెడ్డికి కాంగ్రెస్‌లో ఇంకా టికెట్ కన్ఫాం కాలేదన్నారు. గద్వాలలో ముఖ్యమైన కార్యక్రమం ఉన్నందున రేపు సీఎల్పీ సమావేశానికి వెళ్లడం లేదని స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ గెలుపు కోసమే పనిచేస్తున్నానని.. రాహుల్‌ను ప్రధానిగా చూడాలన్న ఆశతో పని చేస్తున్నానని వెల్లడించారు. బలం చేకూర్చే నాయకులు కాంగ్రెస్‌లోకి వస్తే తప్పు లేదుగానీ.. బలమైన నాయకులు పోతే లాభం ఏంటని డీకే అరుణ ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories