తూర్పు గోదావరి జిల్లాలో వ్యాపారులకు కలిసి రాని దీపావళి

x
Highlights

తూర్పు గోదావరి జిల్లా బాణసంచా వ్యాపారులకు ఈ ఏడాది దీపావళి కలిసి రాలేదు. సుప్రీం తీర్పుతో పాటు స్ధానిక పోలీసుల ఆంక్షలు , పరిమిత సమయంలో అమ్మకాలకు అనుమతి...

తూర్పు గోదావరి జిల్లా బాణసంచా వ్యాపారులకు ఈ ఏడాది దీపావళి కలిసి రాలేదు. సుప్రీం తీర్పుతో పాటు స్ధానిక పోలీసుల ఆంక్షలు , పరిమిత సమయంలో అమ్మకాలకు అనుమతి ఇవ్వడంతో లక్షలాది రూపాయల సరుకు వ్యాపారుల దగ్గరే ఉండిపోయింది. దీంతో తప్పని సరి పరిస్ధితుల్లో తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తోందంటూ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటా తమ వ్యాపారానికి వరుణుడు అడ్డొస్తే ఇప్పుడు మాత్రం పోలీసుల నిబంధనలు శాపంగా మారాయంటూ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాణ సంచా విక్రయాలకు ఒక్క రోజే అనుమతి ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో వాణిజ్య, పన్నుల శాఖ అధికారులు దాడులు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories