వారు వీరు కాదు ఫేస్‌బుక్‌ క్వీన్‌ ఈవిడే!

Submitted by nanireddy on Wed, 05/16/2018 - 11:37
divya-anveshita-star-facebook-live-hyderabad

భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా లంగా ఓణీ, నొదుటిన బొట్టు. చేతికి గోరింటాకు పెట్టుకుని ఓ రోజు ఫేస్‌బుక్‌ లో ప్రత్యక్షమైంది ఓ యువతీ. అంతే ఇక ఫేస్‌బుక్‌ లో ఆమె పేజీకి లక్షల్లో వ్యూస్.. వేల కొద్ది షేర్స్.. కొంత కాలంగా తెలుగు ఫేస్‌బుక్‌ యూజర్లను ఆకర్షిస్తోంది దిల్‌సుఖ్‌నగర్‌లోని మధురాపురీ కాలనీకి చెందిన దివ్య అన్వేషిత. చదివింది మ్యూజిక్  లో డిప్లొమా అయినా సమాజంలో జరుగుతున్న వాటిని ఫేస్‌బుక్‌ లో లైవ్ డిస్కషన్ ఏర్పాటు చేస్తుంది.. ఈ క్రమంలో ఆమె ప్రయత్నాన్ని అభినందించకుండా వుండలేకున్నారు యువత.. కరెంటు ఇష్యూస్ మీద దివ్య జరిపే చర్చలు పలువురిని ఆలోచింపజేస్తున్నాయి.

 ప్రతిరోజు ఫేస్‌బుక్‌ లైవ్ లోకి వచ్చే దివ్య తన ఫాలోవర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతోంది. అలాగే  వారి సమస్యలకు పరిష్కారాలు చెబుతోంది.. దీంతో ఆమె చెప్పే సమాధానాల కోసం ఫేస్‌బుక్‌ లో లక్షల మంది    వెయిట్ చేస్తుంటారు. ఇవే కాకుండా అప్పుడప్పు సమాజంలో జరిగే కొన్ని తీవ్ర సంఘటనలపై దివ్య ఫేస్‌బుక్‌ లైవ్ లో చర్చా కార్యక్రమం చేపడుతోంది. ఇటీవల దేశాన్ని కుదిపేసిన కథువా ఘటనపై దివ్య లైవ్‌ ఏకంగా నాలుగు గంటలు కొనసాగింది. ఓ అమ్మాయిగా తాను బయట ఎదుర్కొనే సమస్యలను సైతం ఆరోజు లైవ్‌లో వివరించింది. అంతేకాకుండా కరీంనగర్ కు చెందిన ఓ యువకుడు ప్రేమ విఫలమైందని ఆత్మహత్యకు యత్నించాడు .. ఇంతలో దివ్య చెప్పిన సూక్తి విని అతనికి జ్ఞానోదయం కలిగింది. దీంతో అతను ఆ బాధను మరచిపోయి హాయిగా వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.. అలాగే ప్రేమవిఫలమైన వ్యక్తులు చాలా మందికి హితబోధ చేసింది.. అంతేకాకుండా సమాజంలో ఆడవారి ప్రాముఖ్యతను గూర్చి చెప్పి ఎంతో మందిని ఆకట్టుకుంది.  ఈ క్రమంలో  ఇప్పటివరకు 20–30 సార్లు 17లక్షలవ్యూస్‌ రాగా, 60–70సార్లు 5–7లక్షల వ్యూస్‌ ఉండడం గమనార్హం. ఎలాంటి ఆర్భాటం లేదు  పైగా దివ్య సెలబ్రిటీ కూడా కాదు..  కేవలం ఆమె చెప్పే మంచి మాటలకోసమే ఆమెను ఫాలో అవుతున్నారు.. దీంతో అందరికి దివ్య ఫేస్‌బుక్‌ క్వీన్ గా అవతరించిందంటున్నారు ఫాలోవర్స్.   

English Title
divya-anveshita-star-facebook-live-hyderabad

MORE FROM AUTHOR

RELATED ARTICLES