ధర్నాచౌక్‌ పునరుద్దరణపై పరిరక్షణ సమితి హర్షం

Submitted by chandram on Wed, 11/14/2018 - 20:02

ధర్నాచౌక్‌ను పునరుద్దరించడంతో ధర్నాచౌక్ పరిరక్షణ సమితి స్వీట్లు పంచుకుని సంతోషం వ్యక్తం చేసింది. ఇది ప్రజా విజయం అని తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన ధర్నాచౌక్‌పై హైకోర్టు తీర్పు హర్షనీయం అని సమితి సభ్యులు చెబుతున్నారు. ధర్నచౌక్ పై అరుణోదయ కళాకారిణి, ప్రజా ఉద్యమాల పోరాట వనిత విమలక్క మాట్లాడుతూ హైకోర్టు తీర్పును స్వాగతీస్తున్నామని ఇంత కాలానీకి న్యాయ్యం బ్రతికేఉందని ఈ తీర్పే నిదర్శనమని, నియంత్రుత్వ ప్రభుత్వానికి చెంపపెట్టు అని అన్నారు. కొంతమంది చిరువ్యాపరస్తులకు నష్టం కలుగుతుందని అంటున్నారు అయితే చిరు వ్యాపారస్తులకు ఎలాంటి నష్టం కలుగుదని అన్నారు. ఇది ప్రజల విజయం,పోరాటాల విజయం. ఎప్పడైన ప్రజలే అంతిమంగా గెలుస్తారని, పోరాటాలే నిలుస్తాయని విమలక్క స్పష్టం చేశారు. 
 

English Title
Dharna Chowk Conservation Committee Elation on High Court Verdict

MORE FROM AUTHOR

RELATED ARTICLES