త్రివిక్రమ్,దేవిశ్రీ మధ్య మనస్పర్ధాలు..దేవిశ్రీకి పోటీగా రంగంలోకి అనిరుద్

త్రివిక్రమ్,దేవిశ్రీ మధ్య మనస్పర్ధాలు..దేవిశ్రీకి పోటీగా రంగంలోకి అనిరుద్
x
Highlights

పైకి కనిపించడంలేదు కానీ..దర్శకుడు త్రివిక్రమ్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీకి మధ్య చిన్న కోల్డ్ వార్ నడుస్తోంది. హిట్ కాంబినేషన్ గా పేరు తెచ్చుకున్న...

పైకి కనిపించడంలేదు కానీ..దర్శకుడు త్రివిక్రమ్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీకి మధ్య చిన్న కోల్డ్ వార్ నడుస్తోంది. హిట్ కాంబినేషన్ గా పేరు తెచ్చుకున్న వీళ్లద్దరు ఇప్పుడు విరోదులుగా మారిపోయారు. పంతం నీదా నాదా అనే స్థాయిలో పోటీ పడుతున్నారు. త్రివిక్రమ్, దేవిశ్రీ ప్రసాద్ ది హిట్ కాంబినేషన్. త్రివిక్రమ్ సినిమా అంటే అందులో మ్యూజిక్ డైరెక్టర్ గా దేవినే అనే అంతలా ముద్ర పడింది. కానీ వీళ్ల బంధానికి మధ్యలోనే బ్రేక్ పడింది. సన్నాఫ్ సత్యమూర్తి సినిమా టైంలో ఇద్దరికి మనస్పర్ధాలు వచ్చాయి. దీంతో త్రివిక్రమ్ దేవిశ్రీని పక్కన పెట్టాశాడు. అందుకే అ ఆ సినిమాతో దేవిని కాదని..మిక్కీ జే మేయర్ మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నాడు.

అ,ఆ సినిమాకే కాదు పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి మూవీకి కూడా త్రివిక్రమ్ దేవికి ఛాన్స్ ఇవ్వలేదు. త్రివిక్రమ్, దేవిశ్రీ ఎంత హిట్ కాంబోనో..పవన్ కళ్యాణ‌్ , దేవిశ్రీ ది కూడా అంతే సక్సెస్ ఫుల్ కాంబినేషనే. జల్సా,గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది సినిమాలతో పవన్ కు మాంచి మ్యూజికల్ హిట్స్ ఇచ్చాడు. ఐనా అజ్ఞాతవాసి మూవీకి త్రివిక్రమ్...దేవిశ్రీకి ఛాన్స్ ఇవ్వలేదంటే..ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయనడానికి ఇదే మంచి ఉదాహరణ. అజ్ఞాతవాసి మూవీతో తెలుగులో దేవిశ్రీకి పోటీగా త్రివిక్రమ్ తమిళ్ డైరెక్టర్ అనిరుధ్ ని రంగంలోకి దింపాడు.

అజ్ఞాతవాసి మూవీకి అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ గా త్రివిక్రమ్ ప్రయోగం బెడిసికొట్టింది. అనిరుధ్ మ్యూజిక్ తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. అజ్ఞాతవాసి ఫ్లాప్ కావడంలో..మ్యూజిక్ వైఫల్యం కూడా పాలు పంచుకుంది. దీంతో తెలుగులో దేవిశ్రీ కి అల్టర్ నెట్ గా అనిరుద్ తీసుకురావాలన్న త్రివిక్రమ్ పంచ్ రివర్స్ ఐంది. దేవిశ్రీ నిరూపించుకోకపోయినా..అనిరుద్ సక్సెస్ కాకపోవడంతో..త్రివిక్రమ్,దేవిశ్రీ మధ్య నడుస్తున్న ఈ వార్ లో దేవిశ్రీనే పై చేయి సాధించినట్టైంది.

అజ్ఞాతవాసి మూవీతో అనిరుద్ సక్సెస్ కాకపోవడంతో ఆ ప్రభావం..ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాపై పడింది. త్వరలోనే త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నాడు. దీనికి కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ నే సెలెక్ట్ చేసుకున్నాడు త్రివిక్రమ్. అజ్ఞాతవాసి ఫ్లాప్ తో..త్రివిక్రమ్ పనితనంపై ఎన్టీఆర్ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు కానీ..సంగీత దర్శకుడిగా అనిరుద్ పై అసంత్రుప్తిగా ఉన్నాడట. అనిరుద్ కి బదులు దేవిశ్రీని తీసుకోవాలి సూచించాడట. మరి ఫైనల్ గా ఎవరు కన్పామ్ అవుతారోచూడాలి.

దేవిశ్రీ ప్రసాద్ కెరీర్ కూడా ప్రజెంట్ అంత బాగా ఏం లేదు. దేవిశ్రీ బాణీలు ప్రజెంట్ పెద్దగా సందడి చేయడంలేదు. హిట్స్ లేకపోవడం..కాఫీ ట్యూన్ అనే ప్రచారం జరగడం దేవిశ్రీ ని కెరీర్ ని దెబ్బతీశాయి. ప్రస్తుతం దేవిశ్రీకి రంగస్థలం, భరత్ అనే నేను రెండే పెద్ద సినిమాలు ఉన్నాయి. వీటితో నిరూపించుకుంటూనే దేవిశ్రీ తన స్టార్ డైరెక్టర్ ఇమేజ్ ను కాపాడుకుంటాడు లేకపోతే అంతే. దేవిశ్రీ సొంతగా తన సత్తాను నిరూపించుకోకపోయినా..అజ్ఞాతవాసి మూవీతో అనిరుద్ ఫ్లాప్ కావడంతో..త్రివిక్రమ్ వర్సెస్ దేవిశ్రీ ఫైట్ లో దేవినే గెలిచినట్టైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories