పెరిగిపోతున్న జంప్ జిలానీలతో కమలం కకావికలం..?

పెరిగిపోతున్న జంప్ జిలానీలతో కమలం కకావికలం..?
x
Highlights

ఏపీ బీజేపీలో జంప్ జిలానీలు పెరిగిపోతున్నాయి. బూత్‌ లెవెల్ నేతల నుంచి అధికార ప్రతినిధుల వరకూ టెలికాన్ఫరెన్స్ ద్వారా ఉత్తేజపరిచేందుకు మోడీ చేస్తున్న ప్రయత్నాలేవీ ఏపీలో ఫలించలేదు.

ఏపీ బీజేపీలో జంప్ జిలానీలు పెరిగిపోతున్నాయి. బూత్‌ లెవెల్ నేతల నుంచి అధికార ప్రతినిధుల వరకూ టెలికాన్ఫరెన్స్ ద్వారా ఉత్తేజపరిచేందుకు మోడీ చేస్తున్న ప్రయత్నాలేవీ ఏపీలో ఫలించలేదు. ఏపీలో బీజేపీ బలోపేతం మాట పక్కనపెడితే ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుందన్న ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. సంక్రాంతి తర్వాత ఏపీలో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయి. వలసలు, పార్టీ ఫిరాయింపులు భారీ ఎత్తున ఉండబోతున్నాయి. ముఖ్యంగా బీజేపీలో జంప్ జిలానీలు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. దీంతో 2019 ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెడతామని ఇప్పటిదాకా ప్రగల్భాలు పలికిన బీజేపీకి ఏపీలో ఉనికి ప్రశ్నార్థకంగా మారబోతుంది.

ఏపీ బీజేపీలో ఇంతకాలం చక్రం తిప్పిన పెద్దలంతా టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీల్లోకి జంప్ అయ్యేందుకు రెడీ అయ్యారు. రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, వైజాగ్ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు, బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్న చెన్ను రామకోటయ్య కాషాయ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. వీరి బాటలోనే మరికొందరు నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది.

ఆకుల సత్యనారాయణ త్వరలో పవన్ సమక్షంలో జనసేన పార్టీలో చేరనుండగా విశాఖపట్నం నార్త్ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు టిక్కెట్టు కన్ఫామ్ అయితే టీడీపీలోకి వెళ్లేందుకు రెడీ అయ్యారు. మరోవైపు విశాఖకు చెందిన బీజేపీ అధికార ప్రతినిధి చెన్ను రామకోటయ్య కూడా అదే బాటలో పయనించనున్నట్టు తెలుస్తోంది. అయితే, బీజేపీ నేతలు మాత్రం ఎవరూ పార్టీ మారడం లేదని, పక్క పార్టీలు మైండ్ గేమ్ ఆడుతున్నాయని చెప్పుకొస్తున్నారు. ఇంకా పార్టీ మారుతున్నట్టు కొందరు నేతలు ప్రకటించనప్పటికీ ఇతర పార్టీల్లో సీట్లు కన్ఫామ్ అయ్యాక జంప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే 175 స్థానాల్లో పోటీ ఏమో గానీ, రాష్ట్రంలో బీజేపీ మనుగడే ప్రశ్నర్థకంగా మారనున్నట్టు అర్ధమవుతోంది. సంక్రాంతి తర్వాత రాష్ట్రంలో కమలం కకావికలం ఖాయంగానే కనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories