బైటపడిన దావూద్ ఫోన్ సంభాషణ

Submitted by arun on Tue, 04/10/2018 - 16:12
Dawood

పాకిస్తాన్‌లో తలదాచుకుంటూ ప్రపంచవ్యాప్తంగా మోస్ట్‌వాంటెడ్‌ నేరగాడు దావూద్‌ ఇబ్రహీం నిర్వహిస్తున్న అక్రమ ఆర్ధిక వ్యవహారాలు మరోసారి బైటపడ్డాయి. పాకిస్తాన్ పాలకులు, అధికారుల రక్షణలో దావూద్ ఇబ్రహీం నిర్వహిస్తున్న వ్యాపారాలకు సంబంధించిన ఫోన్ సంభాషణ వ్యవహారం ఓ ఆంగ్ల చానెల్ బహిర్గతం చేసింది. 

కరాచీలోని క్లిఫ్టన్‌ జిల్లాలో పాకిస్థాన్‌ గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐ పటిష్ఠ రక్షణలో ఉన్న ‘వైట్‌ హౌస్‌’లో దావూద్‌ ఉంటున్నాడు. అక్కడి నుంచి అతడి అంతర్జాతీయ లావాదేవీలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాడు. ఇప్పుడు అతడి ఆస్తులు విలువ 670 కోట్ల డాలర్లుగా అంచనావేస్తున్నారు. నాలుగేళ్ల కిందట యూఏఈలో తన వ్యాపార ఏజెంటు యాసిర్‌తో అతడు సాగించిన ఫోన్‌ సంభాషణ టేపులు ఇప్పుడు బయటకొచ్చాయి. 

గల్ఫ్‌లో దావూద్ సామ్రాజ్యానికి దుబాయ్‌ కేంద్ర బిందువుగా ఉంది. ఈ ఫోన్‌ సంభాషణల్లో బినామీ పేర్లతో సాగించిన పెట్టుబడులను అతడు చర్చించాడు. దుబాయ్‌లోని ఆకర్షణీయ ‘అల్‌ఖాయిల్‌ హైట్స్‌’ ప్రాజెక్టులో క్రయ విక్రయాల గురించి యాసిర్ తో ప్రస్తావించాడు. ఈ ప్రాజెక్టుపై వచ్చే లాభాల గురించి కూడా వారు చర్చించుకున్నారు. స్థిరాస్తి లావాదేవీలను పూర్తిచేసుకునే క్రమంలో కొనుగోలుదారులు, విక్రేతలు తమ నిధులను భద్రపరచుకునేందుకు ఉపయోగించే ‘ఎస్క్రో ఖాతా’ ఏర్పాటుపైనా వారు మాట్లాడుకున్నారు. 

దుబాయ్‌లోని అల్‌ హమరియా రేవు దగ్గర ఒక ఆకాశ హర్మ్యంలో దావూద్‌ కమ్యూనికేషన్‌ కేంద్రం ఉందని పోలీసు అధికారులు తెలిపారు. ముంబయిలోని నేరగాళ్లు అతడితో మాట్లాడటానికి దుబాయ్‌ వెళ్లి ఫోన్‌ చేస్తుంటారని చెప్పారు. భారత్‌ నుంచి ఫోన్‌ చేస్తే నిఘా సంస్థలు ట్యాప్‌ చేస్తాయన్న ఉద్దేశంతో వారు ఈ పనిచేస్తుంటారని వివరించారు.

English Title
Dawood's business nerve centre in Dubai exposed

MORE FROM AUTHOR

RELATED ARTICLES