స్మిత్‌, వార్నర్‌పై ఏడాది నిషేధం

Submitted by arun on Wed, 03/28/2018 - 14:59
Cricket Australia

బాల్‌ టాంపరింగ్‌ వివాదంలో చిక్కుకున్న స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌, బాన్‌క్రాఫ్ట్‌పై క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) వేటు వేసింది. ఈ వ్యవహారంలో సీఏ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని యావత్తు ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో వారిపై కఠినచర్యలే తీసుకుంది. స్మిత్‌, వార్నర్‌పై ఏడాది నిషేధం, బాన్‌క్రాఫ్ట్‌పై 9 నెలల నిషేధాన్ని విధించింది. ఇప్పటికే స్మిత్‌, వార్నర్‌లకు ఐపీఎల్‌ రాజస్థాన్‌ రాయల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంచైజీలు  కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలిగిస్తూ షాక్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. క్రికెట్‌ ఆస్ట్రేలియా తీసుకునే చర్యలపైనే స్మిత్, వార్నర్‌ల ఐపీఎల్‌ భవితవ్యం ఆధారపడి ఉందని గతంలో ఐపీఎల్‌ చైర్మన్‌ రాజీవ్‌ శుక్లా మీడియాకు తెలిపారు. బీసీసీఐతో సమాలోచన చేశాకే స్మిత్‌పై తమ నిర్ణయం వెలువరిస్తామని ప్రాంచైజీలు ప్రకటించాయి. ఇప్పుడు క్రికెట్‌ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేదం విధించడంతో ఈ ఆటగాళ్లు  ఐపీఎల్‌లోనూ అనుమతించరనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి బీసీసీఐ మాత్రం ఎలాంటి నిర్ణయం ప్రకటన చేయలేదు.


 

English Title
david warner and smith banned one year cricket australia

MORE FROM AUTHOR

RELATED ARTICLES