బాల్కనీలో వేలాడిన పసిప్రాణం..

Submitted by nanireddy on Mon, 09/10/2018 - 18:38
daring-youth-saver-child-dangling-from-balcony

తల్లిదండ్రుల నిర్లక్ష్యం కారణంగా ఓ పాప ప్రాణాపాయంనుంచి తప్పించుకుంది. మూడంతస్థుల  భవంతిలో ఇరుక్కుని అల్లాడిపోయింది. చైనాలో ఇటీవల ఈ ఘటన జరిగింది. ఓ బిల్డింగ్ లో నివాసముంటోంది చింగ్ ఉం.. కుటుంబం అతనికి రెండేళ్ల చిన్నారి ఉంది. ఆ చిన్నారి ఇంట్లో నిద్ర పోతున్న సమయం చూసి బయటికి వెళ్ళాడు. ఇంతలో ఆ చిన్నారి నిద్రలేచి.. తండ్రికోసం బాల్కనీలో తొంగి చూసింది. ఇంతలో ప్రమాదవశాత్తు కిందపడబోయి.. బాల్కానీకున్న ఫెన్సింగ్ లో తల ఇరుక్కుంది. అప్పుడే బిల్డింగ్ పరిసర ప్రాంతానికి చేరుకున్న కొరియర్ బాయ్ పాప పరిస్థితి చూసి. అత్యంత చాకచక్యంగా పాప ప్రాణాలు కాపాడాడు. ఆ తరువాత పాప తండ్రి వచ్చి  జరిగిన విషయాన్నీ తెలుసుకుని పాపను హత్తుకున్నాడు. అనంతరం కొరియర్ బాయ్ కి కృతజ్ఞత తెలియజేశాడు. 

English Title
daring-youth-saver-child-dangling-from-balcony

MORE FROM AUTHOR

RELATED ARTICLES