పార్టీ వీడడంపై క్లారిటీ ఇచ్చిన దానం

Submitted by arun on Mon, 09/10/2018 - 14:43
danam

తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్నవార్తల్నిదానం నాగేందర్ ఖండించారు. తను ఏ హోటల్‌లో ఉత్తమ్‌ను కలువలేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు టిక్కెట్లు దొరక్క తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వాట్సప్ మెసేజ్‌లు చూసి ఎమోషనల్ అయ్యే నేతను కానని అన్నారు. కెసిఆర్ తనకు ఏ బాధ్యత ఇచ్చినా స్వీకరిస్తానని దానం తెలిపారు. ఎలాంటి షరతులు లేకుండానే టీఆర్‌ఎస్ పార్టీలో చేరా. 105 మంది జాబితాలో నా పేరు లేకపోవడం పట్ల నాకుఎలాంటి బాధలేదు. ఇష్టం ఉన్నవారికే సీటు ఇవ్వాలని టీఆర్‌ఎస్ అధిష్టానానికి చెప్పా. కాంగ్రెస్ పార్టీలో వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య పరిస్థితి ఆటలో కాయిన్‌లా తయారైంది. కాంగ్రెస్ నుంచి త్వరలోనే చాలా మంది టీఆర్‌ఎస్ గూటికి చేరుతారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు దక్కకుండా శ్రమిస్తామని తెలిపారు.

English Title
danam nagender fire on congress leader

MORE FROM AUTHOR

RELATED ARTICLES