మల్లన్న సాగర్ నష్టపరిహారం పంపిణీ బాధ్యతలు స్మితా సభర్వాల్‌కు అప్పగింత

మల్లన్న సాగర్ నష్టపరిహారం పంపిణీ బాధ్యతలు స్మితా సభర్వాల్‌కు అప్పగింత
x
Highlights

మల్లన్నసాగర్‌ భూ నిర్వాసితులకు యుద్ధ ప్రాతిపదికన పునరావాసం కింద తక్షణ పరిహారం చెల్లించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. పరిహారం ప్రక్రియ ఇప్పటికే చాలా...

మల్లన్నసాగర్‌ భూ నిర్వాసితులకు యుద్ధ ప్రాతిపదికన పునరావాసం కింద తక్షణ పరిహారం చెల్లించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. పరిహారం ప్రక్రియ ఇప్పటికే చాలా వరకు పూర్తయిందన్న కేసీఆర్ మిగిలిన ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని సీఎస్‌ ఎస్కే జోషీని ఆదేశించారు. మల్లన్నసాగర్ జలాశయం పనుల్లో పురోగతి, భూనిర్వాసితులకు ఉపాధి, పునరావాసంపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ నెల 11లోపు పరిహారం, పునరావాసం నివేదికను హైకోర్టుకు సమర్పించాలని నిర్దేశించారు. పునరావాసం ప్రక్రియను సీఎస్‌ స్వయంగా పర్యవేక్షించాలన్నారు. అందుకోసం గ్రామాల వారీగా శిబిరాలను నిర్వహించాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు, మల్లన్నసాగర్‌ గుండె లాంటిదన్నారు. భూ నిర్వాసితుల విషయంలో ప్రభుత్వం సానుభూతితో ఉందని, ఉపాధి, పునరావసం విషయంలో దేశానికే ఆదర్శంగా ఉండే ప్యాకేజీని ఇస్తామని కేసీఆర్ భరోసా ఇచ్చారు. మల్లన్నసాగర్‌ నిర్వాసితులకు 8వందల కోట్లతో పరిహారం, పునరావాస కార్యక్రమాలు చేపట్టనున్నట్టు చెప్పారు.

మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల పునరావాసంపై నిర్వహించిన సమీక్షలో పునరావాస సాయం త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. మల్లన్నసాగర్ నిర్వాసితుల పునరావాసంపై హైకోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. నిర్వాసితుల పరిహారం చెల్లింపుల విషయంలో కోర్టులు జోక్యం చేసుకునే పరిస్థితులు రావడం మంచిది కాదని, ఈ వ్యవహారాన్ని సీఎస్ పర్యవేక్షించాలని కేసీఆర్ ఆదేశించారు. మరోవైపు నష్టపరిహారం పంపిణీ బాధ్యతలను సీఎం కార్యాలయ అధికారి స్మితా సభర్వాల్‌కు అప్పగించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories