కత్తి మహేష్‌పై క్రిమినల్‌ కేసు

Submitted by arun on Sat, 09/08/2018 - 11:00
kathi mahesh

ప్రముఖ సినీ విశ్లేషకుడు కత్తి మహేశ్ పై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదయింది.  గత జూన్‌ 29న బంజారాహిల్స్‌లోని ఓ తెలుగు న్యూస్‌ ఛానెల్‌లో జరిగిన చర్చావేదికలో పాల్గొన్న కత్తి మహేష్‌ రామాయణంలో రాముడు సీతపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడారని అదే రోజు యూసుఫ్‌గూడ సమీపంలోని రహ్మత్‌నగర్‌కు చెందిన గడ్డం శ్రీధర్‌ బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు న్యాయ సలహా అనంతరం శుక్రవారం కత్తి మహేష్‌పై ఐపీసీ సెక్షన్‌ 295(ఏ), 505(2) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

English Title
crminal case files against kathi mahesh

MORE FROM AUTHOR

RELATED ARTICLES