సీపీఐ అభ్యర్థులు వీరే..

Submitted by nanireddy on Wed, 11/14/2018 - 20:47
cpi-candidate-list

మహాకూటమి పొత్తులో భాగంగా మూడు సీట్లకు ఒప్పుకున్న సీపీఐ మూడు స్థానాలకు అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఈ మేరకు సీపీఐ కార్యాలయంలో ఆపార్టీ రాష్ట్ర సహాయక కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గం అభ్యర్థిగా చాడ వెంకటరెడ్డి, బెల్లంపల్లి నియోజకవర్గం అభ్యర్థిగా గుండా మల్లేష్, వైరా నియోజకవర్గ అభ్యర్థిగా బానోతు విజయ భాయిల పేర్లను వెల్లడించింది. 

కాగా పొత్తులో భాగంగా తమకు ఐదు సీట్లు కావాలని సీపీఐ పట్టుబట్టి.. నాలుగు సీట్లకు దిగొచ్చింది. ఆఖరికి మూడు సీట్ల సర్ధుబాటు చేసుకుంది. కాంగ్రెస్ అధిష్టానంతో  సీపీఐ జాతీయ నాయకత్వం రంగంలోకి దిగి.. మూడు అసెంబ్లీ, కూటమి అధికారంలోకి వస్తే రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అంగీకారం తెలిపింది. ఇక ప్రకటించిన ముగ్గురు అభ్యర్థులు రేపు లేదా ఎల్లుండి నామినేషన్ దాఖలు చేయనున్నట్టు సమాచారం.

English Title
cpi-candidate-list

MORE FROM AUTHOR

RELATED ARTICLES