శశికళ పుష్ప పెళ్లికి మదురై కోర్టు బ్రేక్‌..!

శశికళ పుష్ప పెళ్లికి మదురై కోర్టు బ్రేక్‌..!
x
Highlights

ఆ మహిళా ఎంపీ ఎప్పుడూ వివాదాలతో వార్తల్లో నిలస్తుంటారు. అలాగే ఆమె రెండో పెళ్లి కూడా పెద్ద సెన్సేషన్ అయ్యింది. పాపం పెళ్లికి ఏర్పాట్లు కూడా పూర్తి...

ఆ మహిళా ఎంపీ ఎప్పుడూ వివాదాలతో వార్తల్లో నిలస్తుంటారు. అలాగే ఆమె రెండో పెళ్లి కూడా పెద్ద సెన్సేషన్ అయ్యింది. పాపం పెళ్లికి ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకుంది. అయితే కోర్టు మాత్రం రెడ్ సిగ్నల్ వేసింది. ఇప్పుడు సోమవారం జరగాల్సిన వేడుక డైలమాలో పడింది. ఆమె ఎవరో కాదు... అన్నా డీఎంకే బహిషృత ఎంపీ శశికళ పుష్ప. ఈ నెల 26న తనకు న్యాయ సలహాదారుగా పనిచేసిన రామస్వామిని పెళ్లి చేసుకునేందుకు ఈమె సిద్ధమయ్యారు. అయితే ఇంతలో రామస్వామి భార్యనంటూ సత్య ప్రియ అనే మహిళ తెరపైకి వచ్చింది. తనకు గతంలో ఆయనతో పెళ్లైందని ఓ పాప కూడా ఉందంటూ ఫోటోలతో పాటూ కొన్ని ఆధారాలు కూడా బయటపెట్టింది.

బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తర్వాత మధురై ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేసింది. ఆధారాలను పరిశీలించిన కోర్టు... భార్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాతే రామస్వామి శశికళను పెళ్లి చేసుకోవాలని లేదంటే అది నేరమని తెలిపింది. ఈ తీర్పుతో శశికళ పెళ్లి దాదాపు వాయిదాపడినట్లేనని ప్రచారం జరుగుతోంది. మహిళా ఎంపీకి గతంలోనే వివాహంకాగా... ఓ కుమారుడు కూడా ఉన్నాడు. అయితే కొన్ని విభేదాలతో భర్త నుంచి ఆమె విడాకులు తీసుకుంది. ఈమె డీఎంకే ఎంపీ చెంప చెళ్లుమనిపించి అప్పట్లో సంచలనం సృష్టించారు. అప్పుడే పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేశారు. జయలలిత మరణం తర్వాత ఆమె దినకరన్ వర్గంలో చేరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories