స్థానిక సంస్థలఎన్నికలకు టీఆర్ఎస్ రెడీ.. రేపు టీఆర్‌ఎస్ విస్తృత సమావేశం

స్థానిక సంస్థలఎన్నికలకు టీఆర్ఎస్ రెడీ.. రేపు టీఆర్‌ఎస్ విస్తృత సమావేశం
x
Highlights

స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసేందుకు టీఆర్ఎస్ సన్నద్దమవుతోంది. జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై...

స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసేందుకు టీఆర్ఎస్ సన్నద్దమవుతోంది. జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు గులాబీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. రేపు తెలంగాణ భవన్ లో జరగనున్న టీఆర్ఎస్ కార్యవర్గ విస్తృత సమావేశంలో పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెడీ అయ్యారు.

సోమవారం తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ రాష్ర్ట కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశానికి నిర్ణయించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సాధించిన టీఆర్ఎస్ ఆ తర్వాత జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లోనూ దాదాపు 80 శాతానికి పైగా టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్ధులు విజయం సాధించారు. లోక్ సభ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు సీఎం కేసీఆర్. స్థానిక ఎన్నికల్లోనూ అన్ని స్థానాలను కైవసం చేసుకునేలా పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు కేసీఆర్.తెలంగాణ రాష్ర్ట మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రులు, లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన అభ్యర్ధులు, పార్టీ రాష్ర్ట కార్యవర్గ సభ్యులు, ఇతర ముఖ్యనాయకులను పార్టీ కార్యవర్గ విస్తృత సమావేశానికి ఆహ్వానించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories